Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Leaders: మహిళా ఎస్సై పై దారుణం.. వైసిపి నాయకులను చెక్కేస్తారు..

YSRCP Leaders: మహిళా ఎస్సై పై దారుణం.. వైసిపి నాయకులను చెక్కేస్తారు..

YSRCP Leaders: కడుపుకు అన్నం తినే మనిషి ఎవడైనా సరే.. ఆడపిల్లలను గౌరవంగా చూస్తాడు. ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలను చూస్తే మరింత రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ ఆ నీలి వైసిపి బ్యాచ్ కి ఇదేమి తెలియదు. నాయకుడు ఎలా ఉంటే.. తాము అలానే ఉంటామని వారు చెబుతున్నారు. తమ చేష్టల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి.. చంపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కుమారుడిని తప్పించడానికి.. అనేక రకాలుగా ప్రయత్నించి.. చివరికి దొరికిపోయి.. […]

YSRCP Leaders: కడుపుకు అన్నం తినే మనిషి ఎవడైనా సరే.. ఆడపిల్లలను గౌరవంగా చూస్తాడు. ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలను చూస్తే మరింత రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ ఆ నీలి వైసిపి బ్యాచ్ కి ఇదేమి తెలియదు. నాయకుడు ఎలా ఉంటే.. తాము అలానే ఉంటామని వారు చెబుతున్నారు. తమ చేష్టల ద్వారా నిరూపించుకుంటున్నారు.

ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి.. చంపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కుమారుడిని తప్పించడానికి.. అనేక రకాలుగా ప్రయత్నించి.. చివరికి దొరికిపోయి.. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. జైలు నిబంధనలు తెలిసినప్పటికీ హంగామా చేసుకుంటూ వెళ్లడంతో అప్పటికే సమయం గడిచిపోయింది. దీంతో అప్పలరాజును పరామర్శించకుండానే జగన్ వెను తిరిగి రావాల్సి వచ్చింది.

జగన్ ఎక్కడికైనా వెళ్తే చాలు వైసీపీ బ్యాచ్ చేసే హంగామా మామూలుగా ఉండదు. రీల్స్.. షార్ట్స్ మాత్రమే కాకుండా.. డ్రోన్ షూట్లు సర్వసాధారణం. ఈ క్రమంలోనే బందోబస్తు నిర్వహించే పోలీసులకు వైసీపీ బ్యాచ్ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అందులో ఆడ ఆఫీసర్లు అయితే వాళ్ల ప్రతాపాన్ని మరింత దారుణంగా చూపిస్తూ ఉంటుంది. జగన్ శ్రీకాకుళం పర్యటనలో కూడా వైసిపి బ్యాచ్ ఒక మహిళా ఎస్ఐ మీద ఇదే స్థాయిలో వీరంగం సృష్టించింది.

మహిళా ఎస్సై ఎం ప్రవళిక మీద ఆముదాలవలస వైసిపి ఇన్చార్జి చింతాడ రవికుమార్.. ఆయన అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. వికృతంగా ప్రవర్తించారు. భౌతిక దాడికి తీయడానికి ప్రయత్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా చుట్టుముట్టారు. అసభ్యంగా తాకారు. సిఐ సన్యాసినాయుడు.. కానిస్టేబుళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిని కూడా గాయపరిచారు.

ఈ వ్యవహారం విన్నట్నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. వైసిపి నేతల మీద తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అల్లరి మూకలను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయ మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తుల మీద నాన్ బేయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. రీల్స్.. ఆ సీసీటీవీ దృశ్యాలను జల్లెడ పడుతున్న పోలీసులు.. ప్రతి ఒక్కరిని స్పష్టంగా గుర్తించి.. చెక్కేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఈ ఘటన పైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించారు. దీనిపై నివేదిక కోరారు. మహిళ అధికారులపై అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరు పరచడానికి శ్రీకాకుళం పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper