YSRCP : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళా నేతలు ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులు చేపట్టిన వారు కూడా ఉన్నారు. అందులో కొందరు సైలెంట్ గా ఉన్నారు. మరికొందరు యాక్టివ్ గా పని చేస్తున్నారు. ముఖ్యంగా హోం మంత్రులుగా పనిచేసిన మేకతోటి సుచరిత, దానేటి వనితలు పెద్దగా యాక్టివ్ కావడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కానీ.. మిగతా మాజీ మహిళా మంత్రుల తరహాలో ప్రకటనలు చేయడం లేదు. దీంతో వారి తీరుపై పెద్ద చర్చ నడుస్తోంది. వారు పార్టీలో కొనసాగుతారా? లేదా? అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు.
* చాలామంది మహిళా నేతలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు కొదువ లేదు. ఆర్కే రోజా, మేకతోటి సుచరిత, విడదల రజిని, దానేటి వనిత, ఉషశ్రీ చరణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మహిళా నేతలు ఉన్నారు. వీరంతా వైసిపి హయాంలో మంత్రి పదవులు చేపట్టిన వారే. అయితే అందరూ యాక్టివ్ గా ఉన్నారు కానీ.. మేకతోటి సుచరిత, దానేటి వనిత మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరు. నియోజకవర్గాలకి పరిమితం అవుతున్నారు. వీరు వైసీపీని వీడుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. అది కూడా జరగలేదు. అలాగని పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఏమో ఉన్నాం అంటే ఉన్నాం అన్నంత మాదిరిగానే కనిపిస్తున్నారు.
* వైఎస్ఆర్ ప్రోత్సాహంతో..
మేకతోటి సుచరిత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. 2009 ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకుముందు సాధారణ జడ్పిటిసి గా ఉన్న ఆమెను రాజకీయంగా ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేయడంతో ఆయన వెంట అడుగులు వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుతో మరోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆమెకు టిడిపి నుంచి ప్రత్యేక పిలుపు వచ్చింది. కానీ వెళ్ళలేదు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రావెల కిషోర్ బాబు చేతుల్లో. 2019లో గెలిచేసరికి జగన్ క్యాబినెట్లో హోం మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గ మార్పుతో ఓడిపోయారు. అప్పటినుంచి ఏం చేయాలో తెలియడం లేదు. పెద్దగా యాక్టివ్ గా కూడా లేరు.
* టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దానికి వనిత. 2009 ఎన్నికల్లో గోపాలపురం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో 2012లో టిడిపిని వీడి జగన్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు వైయస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి. మళ్లీ 2019లో గెలిచి మంత్రి అయ్యారు. ఐదేళ్లపాటు ఈ రాష్ట్రానికి మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఐదేళ్లపాటు మంత్రిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఇద్దరు హోం మంత్రులు వైసీపీలో ఉంటారా ఉండరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.