YSRCP: వైసీపీలోకి ఇన్ మాత్రమే ఉంటుంది.. అవుట్ ఉండదు అనేది సెటైరికల్ మాట. పొరపాటున పార్టీపై అసంతృప్తితో వైసీపీలో చేరితే అంతే. వెళ్లిన రోజు గౌరవం ఉంటుంది. తర్వాత ఎక్కడుంటారో కూడా తెలియడం లేదు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు చేరుతున్నారు. నియోజకవర్గస్థాయి నాయకులు కూడా ఉన్నారు. అయితే వెళ్లిన రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కండువా వేస్తారు. ఒక ఫోటో దిగుతారు. తరువాత మీ చావు మీరు చావండి అన్నట్టు వదిలేస్తారు. వైసీపీలో చేరుతున్న వారి బాధ కూడా అదే. ఎంతో పౌరుషంతో పార్టీని వదిలి వైసీపీలో చేరితే.. అక్కడ కూడా పట్టించుకునే వారు ఉండరు అనేది ఒక వాదన.
* ఇటీవల చేరికలు..
కోస్తాంధ్రలో ఇటీవల వైసిపిలో చేరికలు పెరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదించేవారు.. పదవులు దక్కలేదని భావిస్తున్న వారు అసంతృప్తితో వైసీపీలోకి వెళ్తున్నారు. అటువంటి వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇదే స్థాయిలో గౌరవం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. పార్టీలో చేరాక అసలు పట్టించుకునే వారు లేక పోతున్నారన్న బాధ చేరిన వారిలో ఉంది. మొన్న మధ్యన అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి సాకే శైలజానాథ్ పార్టీలో చేరారు. కొత్తలో తాడేపల్లి కార్యాలయానికి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడేవారు. కానీ తరువాత శైలజా నాథ్ ఎందుకో పెద్దగా పట్టించుకోవడం లేదు. పెద్దగా కనిపించడం లేదు కూడా. ఆయన ప్రాధాన్యతను తగ్గించారా? లేకుంటే ఆయనే తగ్గించుకున్నారా అనేది తెలియడం లేదు.
* టిడిపిలో స్వేచ్ఛ..
తెలుగుదేశం పార్టీలో నాయకులను కలిసేందుకు చంద్రబాబు అవకాశం ఇస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న లోకేష్ సైతం కొంత సమయం కేటాయిస్తారు. ఏదైనా కష్టం చెప్పుకునేందుకు టిడిపిలో అవకాశం ఉంటుంది. కానీ వైసీపీలో మాత్రం మా పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కార్యాలయానికి 7 తలుపులు దాటాల్సి ఉంటుందన్న సెటైర్లు పడేవి. ఇప్పుడు ఆ తలుపుల సంఖ్య తగ్గింది కానీ ఇంకా కొనసాగుతోందన్న అభిప్రాయం ఉంది. ఏదైనా మాట్లాడాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తో అన్నట్టు ఉంది పరిస్థితి. కేవలం నియోజకవర్గస్థాయి నేతల కు మాత్రమే ఎంతో కొంత అవకాశం ఇస్తున్నారు. మిగతా వారికి కనీసం అధినేత కంట్లో కనిపించేందుకు కూడా ఛాన్స్ దక్కడం లేదు. అయితే వైసీపీలో చేరుతున్న వారు ఈ విషయాన్ని బయట పెట్టడంతో.. చేరాలనుకుంటున్న వారు సైతం వెనక్కి తగ్గుతున్నారు. ఇలా అయితే కష్టం అని వైసిపి సీనియర్లే పెదవి విరిస్తున్నారు.