Homeఆంధ్రప్రదేశ్‌YS Vivekananda Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి సడన్ ఎంట్రీ!

YS Vivekananda Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడి సడన్ ఎంట్రీ!

YS Vivekananda Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? సడన్ గా ఈడి ఎంట్రీ ఎందుకు ఇచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయిన తర్వాత ఈ పరిణామాలు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. శుక్రవారం రోజంతా ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో […]

YS Vivekananda Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? సడన్ గా ఈడి ఎంట్రీ ఎందుకు ఇచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయిన తర్వాత ఈ పరిణామాలు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. శుక్రవారం రోజంతా ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేశారు. దీని వెనుక ఏదో ఒక కారణం ఉందన్న అనుమానం పెరుగుతోంది. ఇప్పటివరకు సిబిఐ దర్యాప్తు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఈ డి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఈడి తనిఖీల్లో భారీగా అక్రమ నగదు పట్టుబడినట్లు ప్రచారం నడుస్తోంది. అసలు ఈ హత్యకు సంబంధించి ఈడి రంగంలోకి దిగడమే ఇప్పుడు అందరి చూపు ఈ కేసు పై పడింది.

* మొన్నటి ఎన్నికల్లో నష్టం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డిని బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు వెంటాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు రాయలసీమలో తీవ్రంగా నష్టం చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులను జగన్ కాపాడుతున్నారని, కొమ్ము కాస్తున్నారంటూ వివేక కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల ఆరోపిస్తూ వచ్చారు. న్యాయం కోసం సునీత ఎక్కని గడపలేదు. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె అనుకున్న స్థాయిలో సిబిఐ దర్యాప్తు సాగలేదు. రాజకీయ లబ్ధి కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది అనేది ఆమె ఆరోపణ. ఇదే వాదనతో ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు.

* ఆర్థిక కోణంలోనే..
అయితే ఓ సెటిల్మెంట్ కు సంబంధించి.. ఆర్థికపరమైన విభేదాలతోనే ఈ హత్య జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్య కాదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కానీ సునీత గత ఏడు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సిబిఐ కూడా సాక్షాలు దొరకలేదు. వైసిపి ఐదేళ్ల కాలంలో సిబిఐ దర్యాప్తు సవ్యంగా సాగలేదు. అప్పట్లో ఉన్న సాక్షాలను చెరిపేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతటితో ముందుకు వెళ్లలేమని సిబిఐ కూడా తేల్చి చెప్పింది. ఈ తరుణంలో అసలు నిందితులు దొరకలేదన్నది సునీత ఆవేదన. అయితే ఇప్పుడు సడన్ గా ఈడి ఎంట్రీ ఇవ్వడమే అందరిలోనూ ఒక రకమైన ఆత్రుత. ఆర్థికపరమైన లావాదేవీలు మూలంగా హత్య జరిగింది అనేది వైసీపీ నుంచి వస్తున్న వాదన. దీంతో ఆ కోణంలో ఈడి విచారణకు ఎంట్రీ ఇచ్చి ఉండచ్చు అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమైన మరుసటి రోజు ఈడి ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper