Homeక్రీడలుక్రికెట్‌AUS vs SA: ఆస్ట్రేలియా ఇలా కూడా ఆడుతుందా.. బాబోయ్ ఇదేం విడ్డూరం..

AUS vs SA: ఆస్ట్రేలియా ఇలా కూడా ఆడుతుందా.. బాబోయ్ ఇదేం విడ్డూరం..

AUS vs SA: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినప్పటికీ.. క్రికెట్ మీద పెత్తనం సాగిస్తోంది మాత్రం ముమ్మాటికి ఆస్ట్రేలియానే. ఆస్ట్రేలియా కి సొంత మైదానంలోనే కాదు.. ఇతర దేశాల మైదానాలలో కూడా తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా అనేక ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలతో సంబంధం లేకుండా తిరుగులేని స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. అటువంటి ఆస్ట్రేలియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డమీద తీవ్రంగా తడబడుతోంది. 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు […]

AUS vs SA: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినప్పటికీ.. క్రికెట్ మీద పెత్తనం సాగిస్తోంది మాత్రం ముమ్మాటికి ఆస్ట్రేలియానే. ఆస్ట్రేలియా కి సొంత మైదానంలోనే కాదు.. ఇతర దేశాల మైదానాలలో కూడా తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా అనేక ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలతో సంబంధం లేకుండా తిరుగులేని స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది.

అటువంటి ఆస్ట్రేలియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డమీద తీవ్రంగా తడబడుతోంది. 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు.. బుధవారం జరిగిన మ్యాచ్లో మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయి.. సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మూడో మ్యాచ్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాకపోతే ఈ విజయం డీఆర్ఎస్ ద్వారా సాధ్యమైంది.

ముందుగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. 9 వికెట్ల కోల్పోయి 32 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో క్యారీ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.. మార్ష్ 56.. పీక్ 48 పరుగులతో అదరగొట్టారు. హెడ్.. కూపర్ కన్నోలి.. రేయింషా.. గ్రీన్ వంటి వారు తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోయారు..

ఆ తర్వాత వర్షం మొదలైంది.. లక్ష్యాన్ని 28 ఓవర్లలో 190 పరుగులకు కుదించినప్పటికీ.. సౌత్ ఆఫ్రికా విజయం సాధించలేకపోయింది. విజయానికి 45 పరుగుల దూరంలో నిలిచింది. మార్క్రం 15.. డికాక్ 0, రికెల్టన్ 71, మాథ్యూ బ్రిడ్జికి 25, స్టబ్స్ 14.. భాష్ 13* పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. వర్షం కురిసిన తర్వాత మైదానం మీద ఉన్న తేమను ఆస్ట్రేలియా బౌలర్లు సమర్ధవంతంగా వినియోగించుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేశారు.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపాడు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది.

ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. అయితే చివరి మ్యాచ్లో మాత్రం ఓదార్పు విజయం లభించింది. వర్షం కురిసింది కాబట్టి డిఆర్ఎస్ దాకా మ్యాచ్ వెళ్ళింది. ఒకవేళ వర్షం కురవకుండా ఉండి ఉంటే ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఆ తదుపరి ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. అక్టోబర్ 9న తొలి టెస్ట్.. అక్టోబర్ 18న రెండవ టెస్ట్.. అక్టోబర్ 27న మూడవ టెస్ట్ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper