Sampoornesh Babu: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్ గా సూపర్ హిట్ రేంజ్ కి దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి వారం లోనే దాదాపుగా 90 శాతం రీకవరీ చేసి , వంద కోట్ల షేర్ వైపు పరుగులు తీస్తోంది. ఫ్లాప్ టాక్ వస్తే స్టార్ హీరోలకే వంద కోట్ల షేర్ రావడం కష్టమైన ఈ రోజుల్లో , డిజాస్టర్ టాక్ తో మీడియం రేంజ్ హీరో గా పిలవబడే నాని 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. దీన్ని బట్టీ పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఈ సినిమాకు ఏ రేంజ్ గ్రాస్ వచ్చేదో మీరే ఊహించుకోండి. ఇకపోతే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాటి గురించి నెటిజెన్స్ విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంపూర్ణేష్ బాబు , రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. గతం లో తాను హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో , అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంటే అక్షరాలా 3 కోట్ల రూపాయిలు అన్నమాట. అయితే రెమ్యూనరేషన్ పరంగా సంపూర్ణేష్ బాబు కి న్యాయం చేశారు కానీ , అతనిలో మంచి నటుడు ఉన్నాడని , ఆ నటుడిని వాడుకోలేకపోయారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ శాశ్వతం కాదని , మంచి గుర్తింపు లభించే పాత్ర చేసి , దాని ద్వారా వచ్చే పేరు శాశ్వతం అని , సంపూర్ణేష్ బాబు మంచి పాత్రలకు అర్హుడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు సంపూర్ణేష్ బాబు కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రోజు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది, సంపూర్ణేష్ బాబు కెరీర్ ని ఈ చిత్రం పెద్ద మలుపు తిప్పుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఊహించారు. కానీ సినిమాలో హీరో పక్కన మాత్రమే ఉండే క్యారెక్టర్ అని , దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఈ సినిమాని చూసిన రోజు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. మరి భవిష్యత్తులో అయినా సంపూర్ణేష్ బాబు లోని నటుడిని మేకర్స్ వాడుకుంటారో లేదో చూడాలి.