Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే!

Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే!

Janasena Party: రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు పరిస్థితులను బట్టీ మారిపోతూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచినా వైసీపీ పార్టీ, 2024 లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఎవరైనా ఊహించారా? , కానీ అది జరిగింది. అదే విధంగా 2019 లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ , 2024 లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన […]

Janasena Party: రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు పరిస్థితులను బట్టీ మారిపోతూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచినా వైసీపీ పార్టీ, 2024 లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఎవరైనా ఊహించారా? , కానీ అది జరిగింది. అదే విధంగా 2019 లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ , 2024 లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా? , అది కూడా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కారణంగా కేవలం రాష్ట్రంలోనే కాదు , కేంద్రం లో కూడా NDA ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు కారణంగా పల్లెలు బాగా అభివృద్ధి చెందాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతీ డిపార్ట్మెంట్ కి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీన్ని జనాలు బాగా గుర్తించడం వల్ల , పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ విపరీతంగా పెరిగిందని, రీసెంట్ గా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ‘అపర చాణక్య’ సంస్థ ఒక సర్వే ని నిర్వహించింది.

ఈ సర్వే లో 2024 ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బలం 11 శాతం తగ్గిందట, ఇప్పుడు ఆ పార్టీ కి 34 శాతం ఓట్లు మాత్రమే పడుతాయట. అదే విధంగా ప్రతిపక్షం వైసీపీ పార్టీ కి 13 శాతం ఓటింగ్ తగ్గిందని అంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ కి కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే నమోదు అవుతాయని చెప్పుకొచ్చింది. ఇక జనసేన పార్టీ కి 2024 ఎన్నికల్లో 9 శాతం ఓటింగ్ రాగా , రీసెంట్ సర్వే లో ఆ పార్టీ కి రానున్న ఎన్నికల్లో 30 శాతం ఓట్లు నమోదు అవుతాయని ఈ సర్వే సంస్థ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కూటమి లో ఉండడం కంటే, బయటకు వచ్చి పోటీ చేస్తే జనసేన పార్టీ కి తిరుగులేని భవిష్యత్తు ఉంటుందని , జనాలు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే , టీడీపీ తో సమానంగా ఢీ కొట్టగలడని , ఆయన స్థాయి ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరిందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper