Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ జాబితా తీస్తే అందులో షాలిని పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమెకు ఓట్లు కూడా భారీగానే పడుతున్నాయి. ‘అగ్ని పరీక్ష 2’ సమయంలో ఈమెపై నెటిజెన్స్ లో తీవ్రమైన నెగెటివిటీ ఉండేది. ఎందుకంటే ఈమె రామకృష్ణ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం, అతన్ని అవమానిస్తూ మాట్లాడడం వంటి సంఘటనల వల్ల. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె గేమ్ ఆడే విధానం తో పాటు, ఆమె మాట తీరు, వాదనలు వచ్చినప్పుడు సరైన పాయింట్స్ పెట్టడం వంటి లక్షణాలు చూసి , ఈమెని అభిమానించడం మొదలు పెట్టారు ఆడియన్స్.
కానీ రోహిత్ తో లవ్ ట్రాక్ పెట్టుకోవడం వల్ల , రాబోయే రోజుల్లో ఈమె గ్రాఫ్ భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
రోహిత్ ఈమెతో చాలా మామూలుగానే ఉంటున్నాడు కానీ , షాలిని మాత్రం అతన్ని లవ్ చేస్తోంది. రోహిత్ వైపు అదోలా చూడడం , అతని చేతులు పట్టుకొని నిలిపేయడం, ఆయన ఏ కంటెస్టెంట్ తో మాట్లాడిన అసూయ పడడం వంటివి చూసి ఆడియన్స్ కి చిరాకు కలుగుతోంది. గత వారం తో పోలిస్తే , ఈ వారం ఆమె ఓటింగ్ బాగా పడిపోయింది. అందుకు ముఖ్య కారణం షాలిని గేమ్ మీదకంటే రోహిత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు.ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా జియో హాట్ స్టార్ లో లైవ్ చాటింగ్ చేసింది. ఈ చాట్ లో ఆమె ఈ సీజన్ కంటెస్టెంట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అందులో భాగంగా షాలిని గురించి మాట్లాడుతూ షాలిని ఒక డ్రామా క్వీన్ అని , కన్నింగ్ ప్లేయర్ అని , లిప్ స్టిక్ స్టార్ అని , ఏడుపుగొట్టు మొహం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అరియానా ఈ రేంజ్ లో కామెంట్ చేయడం తో ఒక్కసారిగా నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు. కాస్త కూడా మొహమాటం లేకుండా ఇలా మాట్లాడింది ఏంటి?, అరియనా కి షాలిని కి మధ్య పాత పగలు ఏమైనా ఉన్నాయా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ లో త్రిగున్ , రోహిత్, ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు చాలా బాగా ఆడుతున్నారని , కచ్చితంగా ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారు అనే నమ్మకం ఉందంటూ అరియనా చెప్పుకొచ్చింది.