Avinash Reddy Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడినంత పని జరిగింది. మళ్లీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం తెరపైకి వచ్చింది. నిన్న రోజంతా ఈడి వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు సిబిఐ దర్యాప్తు జరగగా.. ఇప్పుడు ఈ డి ఎంట్రీ ఇచ్చేసరికి తెర వెనుక గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ఇక తప్పించుకోలేమని.. ఉచ్చు బిగుసుకుంటోందని ఒక నిర్ణయానికి వస్తోంది. ఈ తరుణంలో ఎలా ముందుకెళ్లాలో ఆ పార్టీకి తెలియడం లేదు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి అరెస్టు జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే. ఈ హత్యకు సంబంధించి మరోసారి ప్రభావం ఉంటుంది కడప జిల్లాలో.. ఆపై రాయలసీమలో. మరోవైపు అవినాష్ రెడ్డి దూరం అయితే కడప జిల్లాతో పాటు పులివెందుల రాజకీయ బాధ్యతలు చూసేది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న.
* అప్పట్లో వివేకానంద రెడ్డి..
వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదగడం వెనుక వివేకానంద రెడ్డి కృషి ఉంది. పులివెందులతోపాటు కడప జిల్లా బాధ్యతలను ఆయన చూసేవారు. దీంతో రాజశేఖర్ రెడ్డి స్వేచ్ఛగా ఉండేవారు రాష్ట్ర రాజకీయాల్లో. అయితే వైసిపి ఆవిర్భావం నుంచి… పులివెందులతోపాటు కడప జిల్లా బాధ్యతలను చూస్తున్నారు అవినాష్ రెడ్డి. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య అంశంలో జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం ప్రారంభించారు అప్పటినుంచి ఆ పార్టీ డి గ్రేడ్ అవుతూ వచ్చింది. దాని ప్రభావం మొన్న ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు నాయకులు దూరమై.. వివేకా హత్య కేసు నిరూపితమై.. ఇలా రెండు వైపులా నష్టం జరగక తప్పదు.
* భారతీ రెడ్డికి బాధ్యతలు..
అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు జరిగితే కడప జిల్లా బాధ్యతలు ఎవరు చూస్తారు అనేది ప్రశ్న. అయితే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రూపంలో ప్రత్యామ్నాయం ఉంది. కానీ ఆయన పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేరు. మిగతా కుటుంబం సైతం అతడికి సహకరించే అవకాశం లేదు. ఇప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో సగం మంది షర్మిల తో పాటు సునీత వెనుక ఉన్నారు. ఇప్పుడు గాని అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే మిగతావారు కూడా సైలెంట్ అవుతారు. అందుకే ఈసారి భారతీ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించక తప్పని పరిస్థితి. భారతీ రెడ్డి తో పాటు జగన్ పెద్ద కుమార్తె సైతం ఈసారి రంగంలోకి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది.. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.