Vinutha case Update: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అవకాశం లభించింది కదా అని రెచ్చిపోకూడదు. ఎందుకంటే కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. అది వెంటాడితే ఆ తర్వాత చెప్పుకోవడానికి.. చెప్పడానికి ఏదీ ఉండదు. మనం చేసిన పనుల ఆధారంగానే కర్మ ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు.. రాజకీయ నాయకులకూ వర్తిస్తుంది. కాకపోతే సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారు అనుభవించే కర్మ ఫలితాన్ని జనం చూసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినూత చేరిపోయారు.
కోట వినూత ఫైర్ బ్రాండ్ గా శ్రీకాళహస్తి ప్రజలకు సుపరిచితమే. పైగా వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమాలు అప్పట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఏపీలో అప్పుడు మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ వినూత వినూత్నమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో మహిళా మంత్రిగా ఉన్న రోజా దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి చెప్పుతో కొట్టారు. కొట్టడమే కాదు, తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక మహిళ మంత్రివై ఉండి.. ఆడవాళ్ళపై దారుణాలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉంటావా అంటూ వినూత ప్రశ్నించారు.
తన డ్రైవర్ శ్రీనివాసరాయుడు కేసులో వినూత, ఆమె భర్త చంద్రబాబు జైలు పాలు కావడంతో.. వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. గతంలో రోజాను విమర్శిస్తూ వినూత చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ” నాడు రోజాను విమర్శించింది. అడ్డగోలుగా మాట్లాడింది. ఇప్పుడు తను చేసింది ఏంటి? గొప్ప పని కాదు కదా.. ఏకంగా ఒక యువకుడి ఉసురు తీసుకుంది. తన దగ్గర పనిచేసిన వాడి ప్రాణాలను తీసింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు కదా. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వ్యక్తులను ఉపేక్షించకూడదు. ఒకరి మీద విమర్శలు చేసేవారు.. ముందుగా తమ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు వినూతకు తన స్థాయి ఏమిటో తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమె రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిపోయినట్టేనని” వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు..
ఈ కేసులో పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస రాయుడు కాల్ డాటా పరిశీలిస్తున్నారు. అతని బ్యాంకు వివరాలను కూడా గమనిస్తున్నారు. ఈ కేసులో ఇంకా కొన్ని కీలక విషయాలను రాబట్టాల్సి ఉన్నందున.. ఇప్పుడే తాము ఏమి చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కాకపోతే మీడియా లీకుల వల్ల ఈ కేసులో ఉన్న సంచలన విషయాలు రోజుకొకటి చొప్పున బయటికి విడుదలవుతున్నాయి. దీంతో ఈ కేసులో ఇంకా ఏవో విషయాలు ఉన్నాయని ఆసక్తి ప్రజలలో ఏర్పడుతోంది.
ఇలాంటి ఎక్సట్రాలు చేసింది కాబట్టే దేవుడు ఈ వీర ప్రతివ్రత కు బాగా బుద్ది చెప్పాడు…నోటి దూలకు, కొవ్వు ఎక్కిన నటనకు కర్మ వెంటాడింది pic.twitter.com/vobc7acF0Z
— Anitha Reddy (@Anithareddyatp) July 17, 2025