Husharu Pittalu Teaser: ఈమధ్య కాలం లో యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ కి జెన్ జీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. హీరో , హీరోయిన్ కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా , ట్రైలర్ వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉంటే చాలు , థియేటర్స్ కి క్యూలు కట్టేస్తున్నారు. అందుకే కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చే డైరెక్టర్స్, జెన్ జీ ఆడియన్స్ ని ఆకర్షించే కథలనే ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు చేసిన మేకర్స్ ఫెయిల్ అవ్వలేదు. కేవలం కోటి నుండి 2 కోట్ల మధ్యలో సినిమాని పూర్తి చేసి , వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలా కేవలం జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రం ‘హుషారు పిట్టలు’. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఇందులో హీరోకి తండ్రి క్యారెక్టర్ చేసిన భాను అనే నటుడు చెంప పై కొట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇతను చేసిన ఆ పని వల్ల , ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో , అసలు ఏముంది ఈ మూవీ టీజర్ లో చూద్దాం పదా అనే ఆలోచనతో , చాలా మంది ఈ టీజర్ ని ఓపెన్ చేసి చూసారు. తీరా చూస్తే టీజర్ చాలా క్వాలిటీ తో ఉంది. కంటెంట్ కూడా నేటి తరం జెన్ జీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది. వాళ్లకు నచ్చే విధంగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ , సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ టీజర్ లోని చివరి షాట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో హీరోయిన్ హీరో తో శృంగారం చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆమె నాన్నకు తెలియదు.
అకస్మాత్తుగా ఆయన వచ్చి హీరోయిన్ డోర్ ని కొడుతాడు. హీరోయిన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తీస్తుంది. ఆమె చమటలతో తడిసిపోవడాన్ని చూసి ఫ్యాన్ క్రింద కూర్చున్నా కూడా అలా చమటలు పట్టాయి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ‘గాలి చక్కగా వస్తలేదు నాయనా’ అని అంటుంది. అప్పుడు తండ్రి ‘అట్లనా.. ఈ నెల AC పెట్టిస్తానులే అమ్మా..అన్నం తిందువు రా’ అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ‘పది నిమిషాలు నాయనా , ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది’ మీరు తినండి అని అంటుంది. అప్పుడు తండ్రి ‘అబ్బో ఆన్లైన్ క్లాస్’ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ ఒక్క సన్నివేశాన్ని బట్టీ చెప్పొచ్చు , ఈ సినిమాలో జెన్ జీ ఆడియన్స్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. అయితే సోషల్ మీడియా లో నెటిజెన్స్ హీరోయిన్ ని ట్యాగ్ చేస్తూ ‘మీ నాన్న ఇంట్లో AC పెట్టించాడా లేదా?’ అంటూ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.