Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: భోగాపురంలో పవన్ కళ్యాణ్ ఎర్ర బస్సు స్టోరీ.. ఎవరికి తగలాలో వారికి తగిలింది..

Pawan Kalyan: భోగాపురంలో పవన్ కళ్యాణ్ ఎర్ర బస్సు స్టోరీ.. ఎవరికి తగలాలో వారికి తగిలింది..

Pawan Kalyan: 2024లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఏ ముహూర్తంలో అయితే పవన్ కళ్యాణ్ జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అథ: పాతాళానికి తొక్కేస్తా.. అనే హెచ్చరించారు గుర్తుందా. ఈ డైలాగ్ ఒక ఐకానిక్ లాగా మారింది. ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఓడిపోవడం.. 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఫ్యాన్ రెక్కలు మొత్తం ఊడిపోయాయి. దీని అంతటికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. తాను తెగిస్తే.. గట్టిగా నిలబడితే ఎలా ఉంటుందో నిరూపించారు పవన్ […]

Pawan Kalyan: 2024లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఏ ముహూర్తంలో అయితే పవన్ కళ్యాణ్ జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అథ: పాతాళానికి తొక్కేస్తా.. అనే హెచ్చరించారు గుర్తుందా. ఈ డైలాగ్ ఒక ఐకానిక్ లాగా మారింది.

ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఓడిపోవడం.. 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఫ్యాన్ రెక్కలు మొత్తం ఊడిపోయాయి. దీని అంతటికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. తాను తెగిస్తే.. గట్టిగా నిలబడితే ఎలా ఉంటుందో నిరూపించారు పవన్ కళ్యాణ్. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ తనకు దొరికిన ప్రతి సందర్భంలోనూ జగన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.

తాజాగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో కూడా జగన్ ను పవన్ కళ్యాణ్ వదిలిపెట్టలేదు.. గతంలో భోగాపురం విమానాశ్రయ ఏర్పాటు సమయంలో అక్కడి ప్రజలలో జగన్ ఏ విధంగా రెచ్చగొట్టింది.. భోగాపురం విమానాశ్రయాన్ని ఆదుకోవడానికి ఏ విధంగా కుట్రలు చేసింది.. ఇలా ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ అశేషమైన ఆంధ్ర ప్రజల ముందు వివరించారు.

నాడు భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేటప్పుడు జగన్ ఇక్కడ పర్యటించారని.. ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకని.. విమానాశ్రయం ఏర్పాటును తాను అడ్డుకుంటామని.. అవసరమైతే కేసులు కూడా వేస్తామని జగన్ హెచ్చరించిన విషయాలను పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో వెల్లడించారు. ఎర్ర బస్సు రాని భోగాపురం ఇప్పుడు ఎలా మారిపోయింది.. అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇదంతా కూడా కేంద్రం.. రాష్ట్రం వల్ల సాధ్యమైందని పవన్ కళ్యాణ్ వివరించారు. తద్వారా ఇన్ని రోజులపాటు క్రెడిట్ చోరీ అంటూ వైసిపి చేస్తున్న ఆరోపణకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత వైసిపి జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సాక్షి అయితే జగన్ వల్లే భోగాపురం సాధ్యమైందని కవరింగ్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ వాస్తవం ఏంటో ఏపీ ప్రజలకు తెలుసు. జగన్ భోగాపురం విషయంలో మాట్లాడిన ప్రతి మాటను.. విమానాశ్రయ ఏర్పాటు సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం..వల్ల వైసిపి ప్రచార ఆర్భాటానికి.. సాక్షి అడ్డగోలు వ్యవహారానికి చెక్ పెట్టినట్టు అయింది. పవన్ కల్యాణ్ చెప్పిన ఎర్రబస్సు స్టోరీ ఆహూతులను ఆకట్టుకోవడమే కాదు, నవ్వించింది కూడా..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper