Jana Nayagan: ఇండస్ట్రీ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి , కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఒక హీరో కి చివరి సినిమా అద్భుతంగా ఉండాలని , జనాల్లో హృదయాల్లో ఆ సినిమాని శాశ్వతంగా గుర్తించుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. కానీ తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ అభిమానులకు చేదు అనుభవాలను మిగిలించింది. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది. కానీ దురదృష్టం కొద్దీ సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి సర్టిఫికేట్ నిరాకరించడం తో , విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమా ఆన్లైన్ లో లీక్ అవ్వడం , సినిమా విడుదల 6 నెలల పాటు వాయిదా పడడంతో నిర్మాతకు వడ్డీల రూపం లో భారీ నష్టాలు కలిగాయి.
అలా ఎన్నో సవాళ్ళను ఎదురుకొని థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా, ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియా లో ఏ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి కూడా, డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టేంత సత్తా లేదు. కానీ ఆ రేంజ్ వసూళ్లు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 203 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 306 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి అన్నమాట.
అంటే మరో 150 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తే కానీ , ఈ సినిమా నిర్మాత సేఫ్ అవ్వడు . అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో ఈ చిత్రానికి కేవలం మరో 20 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు చూసిన కనీసం 50 కోట్లకు పైగా నష్టాలు తప్పేలా లేవు. అసలే నష్టాలతో ఈ సినిమాని విడుదల చేశారు. వడ్డీల మీద వడ్డీలు కలిపితే లెక్క ఎక్కడో ఉంది, దానికి తోడు సినిమా విడుదలకు ముందే ఆన్లైన్ లో లీక్ అవ్వడం తో ఓటీటీ రైట్స్ కూడా చాలా తక్కువ రేట్ కి అమ్మేశారు. ఫలితంగా విజయ్ చివరి చిత్రం కమర్షియల్ డిజాస్టర్ గా నిల్చి నిర్మాతకు భారీ నష్టాలను మిగిలించింది.