Casting couch in Tollywood: రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా కొనసాగుతున్న ఓ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. హీరోలు తనను రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టారని, అంగీకరించలేదని అవకాశాలు రాకుండా చేశారు అని, కొందరి చీకటి బాగోతం బయటపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏమన్నారో చూద్దాం..
Also Read: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్(CASTING COUCH) ఉన్నది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. దీన్ని కొందరు హీరోయిన్స్ ఖండిస్తారు. మాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెబుతారు. కానీ అవన్నీ అబద్దాలే. నటిగా ఎదిగే క్రమంలో ప్రతి హీరోయిన్ కి ఈ ఇబ్బందులు తప్పవు. కొందరు తెలివిగా తప్పించుకుని తమ కలలు నెరవేర్చుకుంటారు. మరి కొందరు ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవుతారు. ఓ స్థాయికి వచ్చాక కూడా వేధింపులు తప్పవు అని కొందరు హీరోయిన్స్ మాటలు వింటే అర్థం అవుతుంది. హీరోయిన్ గా కొనసాగడం అంత ఈజీ కాదు. దర్శకులు, నిర్మాతలు, చివరికి స్టార్ హీరోలు కూడా క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడతారని తెలుస్తుంది.
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న మల్లికా షెరావత్(MALLIKA SHERAWAT) గతంలో చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపాయి. 2002లో విడుదలైన జీనా సిర్ఫ్ మేరే లియే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది మల్లికా షెరావత్ అలియాస్ రీమా లంబా. ఆ చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. రెండో చిత్రం ఖ్వాహిష్ లో లీడ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. మర్డర్ సినిమాలో అలాంటి సన్నివేశాల్లో నటించి శృంగార తార ఇమేజ్ తెచ్చుకుంది. దాంతో మల్లికా షెరావత్ కి అలాంటి పాత్రలే ఎక్కువగా దక్కాయి.
ఆమెకున్న ఇమేజ్ రీత్యా పలువురు స్టార్ హీరోలు రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టారట. మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ… రాత్రి కలవాలని పలువురు స్టార్ హీరోలు నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా నేను రాత్రి వాళ్ళను ఎందుకు కలవాలి. తెరపై బోల్డ్ రోల్స్ చేసినంత మాత్రాన.. వారు చెప్పినట్లు నేను వినాలా? కొందరు స్టార్ హీరోలతో నేను రాజీ పడలేదు. అందుకే ఆఫర్స్ లేకుండా చేశారు. అందుకే ఇప్పుడు నా చేతిలో సినిమాలు లేవు. అన్నారు.
Also Read: జబర్దస్త్ పొట్టి నరేష్ క్రేజీ లవ్ స్టోరీ, పెళ్లి పీటల మీద నుండి వచ్చేసేది!
రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ మల్లికా షెరావత్ చేసింది చాలా తక్కువ సినిమాలు మాత్రమే. 2017 తర్వాత ఓ ఐదేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఈ గ్యాప్ లో కొన్ని వెబ్ సిరీస్లు చేసింది. 2024లో చివరిగా విక్కీ విద్యా ఓహ్ వాలా వీడియో చిత్రంలో నటించింది. పరిశ్రమకు రాకముందు మల్లికా ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. ఆ సమయంలో కరణ్ సింగ్ అనే పైలెట్ ని వివాహం చేసుకుంది. అనంతరం విడాకులు తెచ్చింది. ఫ్రెంచ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సిరిల్లే తో మల్లికా డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి.
View this post on Instagram