Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల షూటింగ్ అప్డేట్స్ వచ్చేశాయి.. అభిమానులకు నిరాశ తప్పేలా...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల షూటింగ్ అప్డేట్స్ వచ్చేశాయి.. అభిమానులకు నిరాశ తప్పేలా లేదే..

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీ గా గడుపుతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ముంబై లో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ని , కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు డాక్టర్లు. కానీ ఆయన సర్జరీ పూర్తి చేసుకున్న నాలుగు రోజులకే విధుల్లో పాల్గొన్నారు. ఒక పక్క డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు వహిస్తూనే , […]

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీ గా గడుపుతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ముంబై లో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ని , కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు డాక్టర్లు. కానీ ఆయన సర్జరీ పూర్తి చేసుకున్న నాలుగు రోజులకే విధుల్లో పాల్గొన్నారు. ఒక పక్క డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు వహిస్తూనే , మరో పక్క పాలన పరమైన కార్యక్రమాలను చూసుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ‘ఓజీ 2’ సినిమాలో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు కదా , మరి ఆయన ఈ పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనగలడా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. వాళ్ళ సందేహాలకు తగ్గట్టుగానే , ఈ చిత్రం షూటింగ్ ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ , త్వరలోనే తన ఎడమ భుజానికి కూడా సజ్రరి చేయించుకోబోతున్నాడు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి , వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ‘ఓజీ 2’ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేసాడట డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసాడట. అయితే ఈలోపు నాని తో ప్రకటించిన ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట సుజిత్. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి , ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసి , వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పవన్ కళ్యాణ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ‘ఓజీ 2’ కంటే ముందే డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఒక సినిమా కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్.

అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ లోని సెకండ్ హాఫ్ పై పవన్ కళ్యాణ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసాడని, దీంతో సురేందర్ రెడ్డి కొన్ని రోజులు ఈ స్క్రిప్ట్ పై రీ వర్క్ చేసి , మరోసారి ఆ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించినప్పటికీ , ఆయనకు పెద్దగా నచ్చలేదని , దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. సురేందర్ రెడ్డి ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తూనే ఉన్నాడట. ‘ఓజీ 2’ షూటింగ్ పూర్తి అవ్వగానే , ఈ సినిమాని మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో అభిమానులు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూసే అదృష్టం లేదని బాధ పడుతున్నారు. ‘ఓజీ 2’ వచ్చేలోపు 2028 , లేదా 2029 అవుతుంది , అప్పటి వరకు పవన్ ఫ్యాన్స్ రీ రిలీజ్ సినిమాలతో కాలక్షేపం చేయడమే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper