KJQ Movie First Review: దీక్షిత్ శెట్టి శశి ఓదెల హీరోలుగా చేస్తున్న KJQ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు కిరణ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెర్కెక్కించాడు అనే వార్తలైతే వస్తున్నాయి. కిరణ్ సినిమా రిలీజ్ కి ముందే అనారోగ్య కారణంతో చనిపోవడం వల్ల ఈ సినిమాను చాలామంది దర్శకులు ముందుకు వచ్చి ప్రమోషన్స్ లలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కేడి సినిమా సమయంలో కిరణ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సందీప్ రెడ్డి వంగా సైతం ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నాడు. అలాగే సంపత్ నంది సైతం సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమా ఈవెంట్లో భాగమవ్వడం విశేషం…ఇక ఈ మూవీ రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షోస్ ని సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సినిమా మేధావులకైతే వేశారు. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…
అధికారం కోసం పాటుపడే కింగ్ అనే వ్యక్తి తన జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నారు. అతని స్నేహితులు తనని వదిలేసి ఎందుకు వెళ్లారు. తను ఎలాంటి దారిని ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. ఫైనల్ గా ఆయన ఏం సాధించాడు అనేదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది.
ఇక దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో మరోసారి చాలా చక్కటి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడట. మొత్తానికైతే దర్శకుడు కిరణ్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. సినిమాను చూసిన సినిమా సెలబ్రిటీలు సైతం సినిమా మీద పాజిటివ్ గా స్పందించడం ఒక రకంగా సినిమా యూనిట్ కి చాలా మంచి బూస్టప్ ఇచ్చింది.
అలాగే సినిమాలో సాంగ్స్ ఓకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…