Homeఎంటర్టైన్మెంట్Agni Pariksha 2: 'అగ్ని పరీక్ష 2' లో కంటెస్టెంట్ కి స్వీట్ తినిపించి ముఖం...

Agni Pariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లో కంటెస్టెంట్ కి స్వీట్ తినిపించి ముఖం పై కొట్టిన బిందు మాధవి..

Agni Pariksha 2: ‘బిగ్ బాస్ 10’ ని ఈసారి మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో రాబోయే రోజుల్లో మనకి అర్థం అవ్వబోతుంది. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ఆడియన్స్ లో ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి సీజన్ లో కఠినమైన టాస్కులు నిర్వహించబోతున్నామని రీసెంట్ గా అక్కినేని నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇకపోతే […]

Agni Pariksha 2: ‘బిగ్ బాస్ 10’ ని ఈసారి మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో రాబోయే రోజుల్లో మనకి అర్థం అవ్వబోతుంది. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ఆడియన్స్ లో ఈ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి సీజన్ లో కఠినమైన టాస్కులు నిర్వహించబోతున్నామని రీసెంట్ గా అక్కినేని నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇకపోతే గత సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. దాదాపుగా 25 వేల అప్లికేషన్స్ నుండి కేవలం 60 మందిని ఈ షో కోసం ఎంపిక చేశారు. వీరిలో కేవలం 20 మంది మాత్రమే సెలెక్ట్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అవుతారు.

వీళ్లకు వివిధ కఠినమైన టాస్కులను నిర్వహించి కేవలం 6 నుండి 10 మంది సామాన్యులను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా అభిజిత్ , నవదీప్ , బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన షూటింగ్ నిన్ననే అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి. చాలామంది అందంగా లేకపోవడం వల్ల , ‘అగ్నిపరీక్ష 2’ కి దరఖాస్తు చేసుకోవడానికి భయపడ్డారు. కానీ అందాన్ని ఆధారంగా తీసుకొని సెలక్షన్ ప్రక్రియ జరగడం లేదని నిన్నటి షూటింగ్ ఒక ఉదాహరణగా నిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో మంచి పాపులారిటీ ని సంపాదించిన శ్రావణి నాయుడు అనే అమ్మాయి రిజెక్ట్ అయ్యింది. ఈమె చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఈమెకు ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు.

ఇక లుక్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోని రాజకుమారి దయానా కి జడ్జీలు ముగ్గురు కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి సెలెక్ట్ చేశారు. దీన్నీ బట్టే అర్థం చేసుకోవచ్చు , సెలక్షన్ ప్రక్రియ పూర్తిగా టాలెంట్ ఆధారంగా జరుగుతుంది అని. ఈమె తర్వాత మితిలేష్ అనే అబ్బాయికి కూడా ముగ్గురు జడ్జీలు పచ్చ జెండా ఊపారు. ఇతను కూడా డెమోన్ పవన్ లాగా చాలా అద్భుతంగా చేసాడట. కానీ ఇదే తరహా లో సౌర్య అనే అబ్బాయి కూడా పెరఫామెన్స్ ఇచ్చాడట. కానీ అతనికి మాత్రం ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. అందుకు ముఖ్య కారణం , అతని మంచితనం. ఇంతటి మంచితనం బిగ్ బాస్ షో కి పనికిరాదని రిజెక్ట్ చేశారట. ఇది ఇలా ఉండగా గత సీజన్ అగ్నిపరీక్ష షో లో పాల్గొని , బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య లాగానే, రుచిత అనే కంటెస్టెంట్ వచ్చిందట.

ఈమె కూడా దివ్య లాగానే అభిజిత్ పై నెగెటివ్ అభిప్రాయాన్ని చెప్పిందట. ఈమెకు నవదీప్ , బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వగా, అభిజిత్ మాత్రం నీకు చాలా ఓవర్ కాంఫిడెన్స్ ఉందని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇచ్చి , హోల్డ్ లో పెట్టాడట. మరో కంటెస్టెంట్ రోహిత్ నాయుడు చాలా కఠినమైన పరీక్షని ఎదురుకున్నాడు. అతను స్టేజి మీదకు రాగానే బిందు మాధవి అతనికి స్వీట్ తినిపించిందట. ఆ తర్వాత చాలా పొగరుతో ముఖం పై గ్లాస్ లో ఉన్న నీళ్లు కొట్టిందట. ఇక ఆ తర్వాత నీకు కోపం రాలేదా అని బిందు మాధవి అడగ్గా , ‘మీరు జడ్జీలు కాబట్టి నాకు కోపం రాలేదు , అదే తోటి కంటెస్టెంట్ అయ్యుంటే పెద్ద గొడవ చేసేవాడిని’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో బిందు మాధవి , నవదీప్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అని రెడ్ ఫ్లాగ్ ఇవ్వగా, అభిజిత్ మాత్రం నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు నచ్చింది అంటూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడట. ఇది మొదటి రోజు షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్. ఈరోజుటి షూటింగ్ అప్డేట్స్ ని రేపు తెలుసుకుందాం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper