spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kovai Sarala: కామెడీ చేసే కోవై సరళ జీవితం లో ఇంతటి విషాద సంఘటన దాగి...

Kovai Sarala: కామెడీ చేసే కోవై సరళ జీవితం లో ఇంతటి విషాద సంఘటన దాగి ఉందా..?

Kovai Sarala: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ కామెడీ చేస్తుండేవారు. ఇక ఇదే సమయం లో లేడి కమెడియన్ గా తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకొని, ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు కమెడియన్ గా వెలుగొందినా నటి ఎవరంటే కోవై సరళ.. ఇక కోవై సరళ తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేసింది.

ఇక బ్రహ్మానందం ఆమెకి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ను చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవారు.వాళ్ల కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కొన్ని సినిమాలైతే వీళ్ళ కామెడీ వల్లే సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి కొవై సరళ ఎప్పుడు నవ్వుతు, ప్రేక్షకులందరిని నవ్విస్తూ ఉండేది. కానీ ఆమె జీవితంలో కూడా కొన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక అలీ టాక్ షోలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.

ఆమె నటిగా చాలా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఒక రోజు తను ఊటీలో షూటింగ్ చేయాల్సి వచ్చిందట. అదే టైంలో వాళ్ళ నాన్న చనిపోయాడనే వార్త ఆమెకు తెలిసిందట. ఇక అక్కడ ఒక సాంగ్ షూట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమాలో నటిస్తున్న నటినటులు అందరూ ఆ సినిమాలో ఆ సెట్లో ఉన్నారు. అదే సమయంలో తను అక్కడ వాళ్లను పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతే ఆ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. అది చిన్న సినిమా, వాళ్లు మళ్లీ షూట్ చేసుకోవడానికి చాలా సమయం, డబ్బు అవసరం అవుతుందని తను ఆలోచించి తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని అది పూర్తి చేసుకున్నాక ఆమె వాళ్ల నాన్న దగ్గరికి బయలుదేరిందట. కానీ అప్పటికే వాళ్ల నాన్న అంత్యక్రియలు పూర్తి అయ్యాయట.

ఆయన చివరి చూపుకి కూడా తను నోచుకోలేదంటు ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇది చూసిన తమ బంధువులంతా నాన్న చనిపోయాడని తెలిసినప్పుడు షూటింగ్ చేయకుండా రావచ్చు కదా.. ఇప్పుడు చూడు చివరి చూపు కూడా నోచుకోలేదు. తనకి మనిషి కంటే డబ్బే ముఖ్యం అంటూ తనని సూటిపోటీ మాటలతో హింసించారట. ఇక మొత్తానికైతే కోవై సరళ కొన్ని ఎమోషనల్ సంఘటనలు చెబుతూ బాధపడింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper