Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini: వైసిపి వస్తే హోమ్ మినిస్టర్ గా ఆమె.. ముందే ఫిక్స్!

Vidadala Rajini: వైసిపి వస్తే హోమ్ మినిస్టర్ గా ఆమె.. ముందే ఫిక్స్!

Vidadala Rajini: ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం చాలా ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. మళ్లీ అధికారంలోకి వస్తామని బలంగా భావిస్తున్నాయి. కొందరు నేతలు విషయంలో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అప్పుడే తమకు మంత్రి పదవి […]

Vidadala Rajini: ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం చాలా ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. మళ్లీ అధికారంలోకి వస్తామని బలంగా భావిస్తున్నాయి. కొందరు నేతలు విషయంలో అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అప్పుడే తమకు మంత్రి పదవి ఒకరని.. ఫలానా శాఖ అని.. ఇలా ఏవేవో అంచనాలు వేసుకుంటున్నారు. బయట పెట్టుకుంటున్నారు కూడా. తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజిని విషయంలో అదే మాదిరిగా ప్రకటనలు చేశారు అక్కడి వైసీపీ శ్రేణులు. ఓ ఆందోళన కార్యక్రమంలో పోలీసులు ఆమెను అడ్డగించే ప్రయత్నం చేయగా.. ఆమె గట్టిగానే బదులిచ్చారు. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వెనుకున్న నేతలు, కార్యకర్తలు కాబోయే హోమ్ మినిస్టర్ అంటూ నినాదాలు చేశారు.

* ప్రతిపక్షంలో ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు..
ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలు దూకుడు పెంచే క్రమంలో.. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీ సంగతి తేల్చుతాం అంటూ హెచ్చరిస్తున్నారు. నేను హోం మంత్రి పదవి తీసుకుంటాను అని బాహాటంగానే ప్రకటనలు చేసిన వారు ఉన్నారు. గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు నేతలు అప్పటి పాలకపక్షం వైసీపీ తీరును నిరసిస్తూ.. హోం మంత్రి పదవి చేపట్టిన తర్వాత అందరి సంగతి తేల్చుతా అంటూ హెచ్చరికలు జారీచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం అదే మాదిరిగా జరుగుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. విడదల రజిని హోమ్ మినిస్టర్ కావడం ఖాయమని ఆమె అనుచరులు గట్టిగానే హెచ్చరిస్తుండడం విశేషం.

* స్వల్పకాలంలోనే ఉన్నతి..
విడదల రజిని విషయంలో అంతలా ధీమా వ్యక్తం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఆమె తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన అనుచరులుగా కొనసాగుతూ వచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపుతో ఆ పార్టీలో చేరారు. అప్పటికే ఉన్న సీనియర్లను కాదని రజనీకి టికెట్ ఇచ్చారు జగన్. మంత్రిగా ఉన్న ప్రతి పార్టీ పుల్లారావును ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు విడదల రజని. అక్కడితో ఆగలేదు ఆమె ప్రస్థానం. మంత్రివర్గ విస్తరణలో ఏకంగా ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్వల్ప కాలంలోనే రాజకీయంగా తన ముద్ర చాటుకున్నారు. అందుకే ఆమె విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లో ధీమా కనిపిస్తూ ఉంటుంది. వైసిపి గెలిచిన తర్వాత తమ నేత రజిని హోం మంత్రి కావడం ఖాయం అన్న ధీమా వారిలో ఉంది. వైసిపి ఒక వైపు ఇబ్బందుల్లో ఉంటే.. ఇటువంటి ప్రకటనలు చేయడం ఏంటి అనేది సొంత పార్టీలో వినిపిస్తున్న మాట. కానీ రాజకీయాల్లో ఎవరి ధీమా వారిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper