Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Activist: పోలీస్ అయితే.. కాలర్ పట్టుకున్న ఓ నేత అనుచరుడు.. వైరల్

YSRCP Activist: పోలీస్ అయితే.. కాలర్ పట్టుకున్న ఓ నేత అనుచరుడు.. వైరల్

YSRCP Activist: ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు, నిరసనలకు పోలీసుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటనలో ఓ మహిళ ఎస్సై పై అనుచిత ప్రవర్తన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆ ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు […]

YSRCP Activist: ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు, నిరసనలకు పోలీసుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటనలో ఓ మహిళ ఎస్సై పై అనుచిత ప్రవర్తన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆ ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు లో మరో మహిళా ఏఎస్ఐ పట్ల అదే తీరుతో వ్యవహరించారు. మరోవైపు తాజాగా తిరుపతిలో వైసీపీ కార్యకర్త ఒకరు రెచ్చిపోయారు. ఓ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని హల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా కానిస్టేబుల్ పై దూసుకొచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి.. కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరుడిగా ప్రచారం సాగుతోంది.

* తరచూ వివాదాలు..
మొన్నటి ఎన్నికల్లో భూమున కరుణాకర్ రెడ్డి పోటీ చేయలేదు. బదులుగా ఆయన కుమారుడు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తరచూ భూమన కుమారుడి అనుచరుల వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ మే నెలలో అనుచరుడు ఒకరు ఆరు కిలోల గంజాయితో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని గంజాయి వనంగా మార్చుకున్నారు అన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. మరోసారి వారి అనుచరుడిగా భావిస్తున్న ఓ యువకుడు ఏకంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు. దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తుండడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులపై తిరగబడుతున్న దృశ్యాలు తరచూ వెలుగులోకి వస్తున్న క్రమంలోనే.. తిరుపతిలో ఈ దృశ్యం బయటపడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలకు కారణం అవుతోంది.

* ఎక్కడికక్కడే ఎదురు తిరగడం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని.. అందుకే ఇది దగా డీఎస్సీ అంటూ పేర్కొంటూ వైసిపి పెద్ద ఉద్యమమే చేపడుతోంది. ప్రస్తుతం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉండడంతో ఆందోళన కార్యక్రమాలకు నిరాకరిస్తున్నారు పోలీసులు. ఎక్కడా అనుమతించడం లేదు కూడా. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనిని లెక్క చేయడం లేదు. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడికి అక్కడే పోలీసులపై తిరగబడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గంజాయి మత్తులో ఉన్న యువకుడు కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంటూ హల్చల్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by TDP AT 175 (@tdpat175)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper