Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ పై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లు.. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఓ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. దానికి కొనసాగింపు కూడా ఉంటుందని చివరిలో సశేషంలో చూపించారు. కూటమి ప్రభుత్వంపై ఆయన తాజాగా సంధించిన ప్రశ్నలు చూస్తుంటే.. ఆయన పొలిటికల్ రీ యంట్రీ పై.. ఆపై ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై క్లారిటీ కనిపిస్తోంది. మూడు ఘటనలను.. ప్రభుత్వ వైఫల్యాలుగా.. జంగిల్ రాజ్ ను మించిన రాక్షస రాజ్యం గా.. కూటమి పాలనను చూపించారు. పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిన్నపాటి కార్నర్ చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రూపొందించిన ఓ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు అంటూ చంద్రబాబు సర్కార్ ను ప్రశ్నించారు. ఇప్పుడు బిజీ సాయి రెడ్డి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
* మెడికో హత్యపై..
రాజమండ్రిలో మెడికో ప్రియాంక హత్య అంశాన్ని ప్రస్తావించారు. నడిరోడ్డుపై తొక్కించి చంపిన వారిని కచ్చితంగా ఉరి తీయాలి అంటూ అన్నారు. అయితే ఈ విషయంలో ఆమె తండ్రి మాత్రమే పోరాడుతున్నారని… మిగతా బడా నాయకుడు ఎవరు మాట్లాడడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. చంపేసిన వారిని తెలుగుదేశం పార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపణ చేశారు. రెండు దుర్మార్గమైన శిబిరాలు కొనసాగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు.
* వైసిపి పాత్రను గుర్తుచేస్తూ..
మరోవైపు చిలకలూరిపేటలో షేక్ హసీనా అనే మహిళను దారుణంగా హత్య చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యవహారంగా చూపి ఈ కేసును పక్కదోవ పట్టించారంటూ సాయి రెడ్డి ఆరోపించారు. అయితే ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి రూపొందించిన దిశ చట్టాన్ని ప్రస్తావించారు. ఆ చట్టాన్ని రద్దు చేసిన వారు.. కొత్తగా మరో చట్టాన్ని ఎందుకు రూపొందించలేదు అంటూ ప్రశ్నించారు. నేరగాళ్లకు వేగంగా శిక్ష వేసి మరో బిల్లును మాత్రం తీసుకురాకుండా మత్తు నిద్రలో ఉన్నారని చంద్రబాబు సర్కారును తప్పు పట్టారు.
* బాధ్యతాయుతమైన నేతగా..
ఇంకోవైపు విజయవాడలో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ కుమార్తె షేక్ అసిఫా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని ప్రస్తావించారు సాయి రెడ్డి. ప్రమాదానికి కారణాలేంటి? అతివేగమే కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ఐపీఎస్ అధికారి కుమార్తె విషయంలో కూడా నిజాయితీగా నిజాలు చెబుతారు అన్న నమ్మకం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలు వేయడం ద్వారా తాను ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిని అని గుర్తు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ప్రస్తావించడం లేదని.. ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అభిప్రాయపడ్డారు. తద్వారా ఏపీ రాజకీయాలకు తన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకే ఈ పోస్టు అన్నట్టు ఉంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి వైఖరి స్పష్టమవుతోంది క్రమేపి. చూడాలి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారూ…
గత వారం రోజుల్లో ముగ్గురు ఆడపిల్లల ప్రాణాలు అమానుష రీతిలో బలైపోయాయి.
1) రాజమండ్రిలో కనికె ప్రియాంక
2) చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా
3) విజయవాడకు చెందిన షేక్ ఆసిఫాఇందులో ప్రియాంకను దారుణాతి దారుణంగా, జంగిల్ రాజ్‌ను మించిన రాక్షస రాజ్యం…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2026