Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక హీరోకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అవన్నీ చిరంజీవికి ఉన్నాయి. అద్భుతమైన డాన్సులు వేస్తాడు, అదిరిపోయే ఫైటింగ్ లు చేస్తాడు. తన నటనతో ప్రేక్షకుల కండ్లల్లో నీళ్లు రప్పించగలిగేలా నటించి మెప్పిస్తాడు. అందుకే చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అమితమైన ఇష్టం ఉంటుంది. అతని సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తోపాటు రజనీకాంత్ కమల్ హాసన్ లు విపరీతమైన పోటీ పెట్టుకునేవారు. రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కూడా అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా దోచుకున్నారు. వీళ్లకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ ఉండేది. రజనీకాంత్ డాన్సులు పెద్దగా వేసేవాడు కాదు. కానీ కమల్ హాసన్ అయితే అన్ని రకాల డ్యాన్స్ లను వేసేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి సైతం కమల్ హాసన్ ను బీట్ చేసే విధంగా డాన్సులు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు.
రజనీకాంత్ కమల్ హాసన్ లు డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తే చిరంజీవి మాత్రం కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వచ్చాడు. నిజానికి చిరంజీవి ‘ఆపద్బాంధవుడు’ సినిమా చేస్తున్న సమయంలో కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరు చిరంజీవికి ఈ సినిమా సెట్ అవుతుందా? ఆయన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుంది.
కమర్షియల్ సినిమాల్లో యాక్టింగ్ చేసినట్టుగా ఆపద్బాంధవుడు సినిమాలో చేస్తే వర్కౌట్ అవ్వదు అంటూ చాలా వరకు కామెంట్లు చేశారని కొంతమంది అభిమానులైతే చెప్పుకుంటూ ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం వాళ్ళు ఎవరికీ తావివ్వకుండా విమర్శకులతో సైతం ప్రశంసలు కురిపించే విధంగా ఆపద్బాంధవుడు సినిమాలో చాలా అద్భుతమైన నటన కనబరిచాడు.
సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయిన కూడా చిరంజీవి నటనకు మంచి గుర్తింపు వచ్చింది… దాంతో చిరంజీవి మాత్రం తన నటనతోనే రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ ఒకేసారి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడంటూ చిరంజీవి అభిమానులు అప్పట్లో చాలా వరకు కామెంట్స్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి చాలా మంచి నటుడు దానికి మించి చాలా మంచి స్టార్ హీరో అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…