Homeబిజినెస్Chit vs Mutual Fund : చిట్టీలు బెటరా? మ్యూచువల్ ఫండ్స్ మంచివా?

Chit vs Mutual Fund : చిట్టీలు బెటరా? మ్యూచువల్ ఫండ్స్ మంచివా?

Chit vs Mutual Fund : ప్రతి ఒక్కరూ తమ డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకుంటారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడంతో అప్పుల పాలవుతారు. కొంత మందికి పెట్టుబడి పెట్టినా.. తొందరగా, అధిక ఆదాయం రావాలని ఆశపడుతారు. కానీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కువగా చిట్టీలు వేసి డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం […]

Chit vs Mutual Fund : ప్రతి ఒక్కరూ తమ డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకుంటారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడంతో అప్పుల పాలవుతారు. కొంత మందికి పెట్టుబడి పెట్టినా.. తొందరగా, అధిక ఆదాయం రావాలని ఆశపడుతారు. కానీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కువగా చిట్టీలు వేసి డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో అధిక ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటప్పుడు చిట్టీలు బెటరా? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం మంచిదా?

కొందరు వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి నెలా కొంత మొత్తాన్ని డబ్బు పొదుపు చేసుకుంటారు. అవసరం ఉన్నవారు తీసుకొని కొంత మొత్తంలో వడ్డీ చెల్లిస్తారు. ఇలాంటి సమయంలో ముందుగా డబ్బు తీసుకునే వ్యక్తికి అవసరం తీరే అవకాశం ఉంటుంది. అయితే చిట్టీని కేవలం పెట్టుబడిగా కాకుండా.. అవసరమైన సమయంలో డబ్బు పొందే ఆర్థిక సాధనంగా కూడా చూడవచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లో అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి, పథకం లక్ష్యానికి అనుగుణంగా షేర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి వివిధ ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. పెట్టుబడిదారుడికి వచ్చిన విలువలో కొంత చెల్లిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం లేకుండా.. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.5,000, రూ.10,000 లేదా మీ సామర్థ్యానికి అనుగుణంగా మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు పడిపోతుంది? అనే విషయాన్ని అంచనా వేసి పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని సిప్ కొంతవరకు తగ్గిస్తుంది. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే అలవాటును కూడా ఇది పెంచుతుంది.

మరి చిట్టీ, మ్యూచువల్ ఫండ్ మధ్య తేడా ఏంటంటే..? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి పెరగవచ్చు.. తగ్గవచ్చు…ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో స్వల్పకాలంలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉండొచ్చు. పెట్టుబడిపై రాబడి హామీ ఉండదు. చిట్టీలో మీకు మధ్యలోనే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే.. నిబంధనల ప్రకారం ముందుగా చిట్టీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వ్యాపారం ప్రారంభించడం, ఇంటి నిర్మాణం, వివాహం లేదా ఇతర పెద్ద ఖర్చులకు డబ్బు అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడవచ్చు. అయితే ముందుగా డబ్బు తీసుకున్న తర్వాత మిగిలిన వాయిదాలు తప్పకుండా చెల్లించగలమా అనే విషయాన్ని పరిశీలించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper