Venkatesh Anil Ravipudi Movie: వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం షూటింగ్ నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపిస్తుంది కదూ. కానీ అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ లో షూటింగ్స్ పూర్తి చేస్తుంటాడు అనేది అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమాని ఆయన లైట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్నట్టు ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో ఆయనపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 4 దశాబ్దాలు నేటితో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన వెంకట్ రెడ్డి అనే క్యారెక్టర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఇండియన్ ఆర్మీ LT కోలోనల్ గా వెంకటేష్ తన మార్కు హీరోయిజాన్ని ఈ చిత్రం లో చూపించబోతున్నాడు.
ఇక ఆయన బావమరిది గా కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కామెడీ తో పాటు , అదిరిపోయే రేంజ్ యాక్షన్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కీర్తి సురేష్ , కృతి శెట్టి నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెంకటేష్ కి జోడీగా నటిస్తుండగా , కృతి శెట్టి కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తోంది. అనిల్ రావిపూడి కి విక్టరీ వెంకటేష్ తో ఇది 5 వ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన F2,F3,సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలు వచ్చాయి. అన్ని సినిమాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి.
ఇక అనిల్ రావిపూడి డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిందే కళ్యాణ్ రామ్ తో అనే సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘పటాస్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఒకపక్క తనకు జీవితాన్ని ఇచ్చిన హీరో , మరో పక్క తనని స్టార్ ని చేసిన హీరో , ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో పెట్టి తీస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సునామీ ని సృష్టించబోతుందో చూడాలి.
40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI
It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film
Meet our Lt colonel VENKAT REDDY#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox
— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026