Danam Nagender: తెలంగాణ రాజకీయాలలో గతంలో ఈ స్థాయిలో సంచలన పరిణామాలు జరిగేవి కావు. కానీ ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని గులాబీ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు. ఇక ఒక ఎమ్మెల్యే అయితే మరింత ముందడుగు వేసి రేవంత్ ముందే.. అనకూడని మాట అనేశాడు
ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. తొందరపాటు వల్ల జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఒకసారిగా సీఎం కేసీఆర్ అని సంబోధించారు. దీంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను గులాబీ పార్టీ నేతలు విస్తృతంగా సర్కులేట్ చేస్తున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డిని ఓ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించారు. ఆ సమయంలో వేదిక ముందు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అనబోయి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఓ కార్యక్రమంలో సీఎం పేరును తప్పుగా పలికారు. ఇలా అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి పేరును నిర్వాహకులు మర్చిపోయారు. చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా కేసీఆర్ పేరు పలికారు. దీంతో ఇది గులాబీ పార్టీ నేతలకు ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి పేరు సీఎంగా ఎవరూ గుర్తుంచుకోవడంలేదని.. కెసిఆర్ తెలంగాణ ప్రజల్లో.. తెలంగాణ నాయకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గులాబీ పార్టీ నేతలు కవరింగ్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు.
ఏదైనా సభ జరిగినప్పుడు.. సమావేశం నిర్వహిస్తున్నప్పుడు నిర్వాహకుల్లో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. వారిలో తెలియని ఉద్వేగం ఉంటుంది. అప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. కాకపోతే నేటి సోషల్ మీడియా కాలంలో ఇటువంటి వాటికే ఆదరణ ఉంటుంది కాబట్టి.. పైగా ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు తప్పు జరుగుతుందా అని ఎదురుచూస్తాయి కాబట్టి.. ఇటువంటి వ్యవహారాలు మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతుంటాయి. ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా ఒక బ్యాచ్ ఉంటుందని విషయాన్ని ప్రముఖంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఇక్కడ దాన నాగేందర్ రేవంత్ పేరు మర్చిపోయినంత మాత్రాన.. కెసిఆర్ పేరు ప్రస్తావించినతమాత్రాన. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాలేరు.. కెసిఆర్ ముఖ్యమంత్రి అవ్వలేరు. ఈ విషయం తెలిసినప్పటికీ.. కొంతమందికి ప్రచార పిచ్చి ఉంటుంది.. వ్యక్తి పూజ ఉంటుంది కాబట్టి.. హడావిడి చేస్తుంటారు. అంతే అంతకుమించి ఏమీ లేదు.
సీఎం రేవంత్ సభలో తడబడిన ఎమ్మెల్యే దానం నాగేందర్
‘ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల..’ అంటూ సంబోధించిన దానం నాగేందర్
‘కల్వకుంట్ల’ అనగానే ముసిముసి నవ్వులు నవ్విన సీఎం రేవంత్రెడ్డి#DanamNagender #RevanthReddy #Telangana #Congress #KCR #ViralVideo #RTV pic.twitter.com/XD18vc0Jac
— RTV (@RTVnewsnetwork) August 14, 2026