Homeటాప్ స్టోరీస్Kavitha Kalvakuntla : కవిత vs కేటీఆర్.. టీవీ9 రజనీకాంత్ బయటపెట్టిన ఓ పంచాయితీ..

Kavitha Kalvakuntla : కవిత vs కేటీఆర్.. టీవీ9 రజనీకాంత్ బయటపెట్టిన ఓ పంచాయితీ..

సలార్ సినిమా చూశారా.. అందులో జగపతిబాబు వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు.. పీఠం కోసం షియా రెడ్డి.. సుకుమారన్ మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. ఒకరి మీద మరొకరు గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇద్దరు ఒకే తండ్రి కడుపున పుట్టినప్పటికీ.. పీఠం కోసం ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నాలో.. అన్ని రకాలుగా వాటిని అమలు చేస్తూ ఉంటారు. సినిమాలోనే ఇలా జరుగుతుంది అనుకుంటే పొరపాటే.. నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. దానిని నిరూపించారు కేటీఆర్, […]

సలార్ సినిమా చూశారా.. అందులో జగపతిబాబు వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు.. పీఠం కోసం షియా రెడ్డి.. సుకుమారన్ మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. ఒకరి మీద మరొకరు గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇద్దరు ఒకే తండ్రి కడుపున పుట్టినప్పటికీ.. పీఠం కోసం ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నాలో.. అన్ని రకాలుగా వాటిని అమలు చేస్తూ ఉంటారు.

సినిమాలోనే ఇలా జరుగుతుంది అనుకుంటే పొరపాటే.. నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. దానిని నిరూపించారు కేటీఆర్, కవిత. ఈ ఇద్దరి మధ్య బలమైన బాండింగ్ ఉండేది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నాటి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కేటీఆర్.. తెలంగాణ జాగృతి తరఫున కవిత ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలను అధిరోహించారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు. ఎందుకు దూరం పెరిగిందో తెలియదు. కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చారు. కెసిఆర్ ను మర మనిషి అన్నారు. కేటీఆర్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక హరీష్ రావు ను గుంట నక్క అన్నారు. సంతోష్ రావు గురించి తీవ్రస్థాయిలో విమర్శ చేశారు.

ఇలా ఎందుకు జరిగింది.. ఎక్కడ తేడా కొట్టింది.. కుటుంబ పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుంచి ఎందుకు ఆడబిడ్డ బయటికి వచ్చింది.. ఆమె సొంత రాజకీయ కార్య క్షేత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది.. దీనికి సంబంధించి అనేక పర్యాయాలు కవిత ప్రధాన మీడియా ఛానల్స్.. యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీనిపై కవిత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అవి కొన్ని మాత్రమే నమ్మే విధంగా ఉన్నాయి. మిగతావి వాస్తవ దూరంగా ఉన్నాయని విశ్లేషకులు మాట.

ఈ నేపథ్యంలో కవితతో టీవీ9 రజినీకాంత్ క్రాస్ ఫైర్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహించారు. అది ఈ ఆదివారం టీవీ9 లో టెలికాస్ట్ కాబోతోంది. అయితే విడుదలైన ప్రముఖులు మాత్రం రజనీకాంత్ అడిగిన ప్రశ్నలకు కవిత తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కెసిఆర్ ను మరమనిషి అన్నారు.. ఇలా ఎందుకు అన్నారు.. కెసిఆర్ ను ఎదిరించి తెలంగాణలో రాజకీయాలు చేయగలరా.. అని రజనీకాంత్ ప్రశ్నిస్తే.. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ.. అని కవిత చెప్పారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎందుకు బయటికి వచ్చారు అని రజనీకాంత్ ప్రశ్నిస్తే.. నన్ను బయటికి పంపించిన వారినే అడగండి అంటూ కవిత సమాధానం చెప్పారు. సంతోష్ మీద ఆగ్రహం.. కెసిఆర్ మీద కోపం.. కేటీఆర్ మీద ఉక్రోషం … హరీష్ రావు మీద ద్వేషం.. ఇవన్నీ ఎందుకు.. అని రజనీకాంత్ ప్రశ్నిస్తే.. కవిత నవ్వుతూ ఉండిపోయారు.. మొత్తం గా ప్రోమోలో సంచలన ప్రశ్నలు రజనీకాంత్ అడిగినట్టుగా కనిపిస్తోంది. వాటికి కవిత స్పష్టంగానే సమాధానం చెప్పినట్లు అర్థమవుతుంది. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఈ కార్యక్రమం ద్వారా గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పంచాయితీకి సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరును పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఆడబిడ్డను బయటికి పంపించిన పాపం ఊరికే పోదని ఆయన శాపనార్ధాలు పెడుతున్నారు. ఇప్పుడు కవిత కూడా తను పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చింది.. దాని వెనుక ఉన్న కారణాలు.. అలాంటి పని చేసిన వ్యక్తుల గురించి ఓపెన్ గానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కవిత ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత.. ఆమె చెప్పిన మాటలు ద్వారా రేవంత్ మరింత దూకుడుగా గులాబీ పార్టీ మీద విరుచుకుపడే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper