Nagarjuna: అక్కినేని నాగార్జున ని మోసం చేసిన దుండగులు..సంచలనం రేపుతున్న వీడియో!
ఆన్లైన్ సైబర్ క్రైం కి పాల్పడుతున్న దుండగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పోలీసులు ఒక పక్క ఈ అంశంపై సామాన్యులకు అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తూనే ఉన్నారు. కానీ మోసాలు మాత్రం ఆగడం లేదు. అయితే నేడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆద్వర్యం లో నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ అవెర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా విచ్చేసి , తన అనుభవాలను పంచుకున్నాడు. అంత పెద్ద సూపర్ స్టార్ కూడా సైబర్ నేరగాళ్ల భారిన పడ్డారు అనే విషయాన్ని తెలుసుకున్న నెటిజెన్స్ షాక్ కి గురి అవుతున్నారు. నాలుగేళ్ల క్రితం తాను కూడా సైబర్ మోసానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు నాగార్జున.
ఆయన మాట్లాడుతూ ‘గతం లో నాకు ఒక బ్యాంక్ అధికారి పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. నాగార్జున గారు మీరు బిజినెస్ లో చాలా స్మార్ట్ అని విన్నాను , మరి ఎందుకు పెట్టుబడులు చేయడం లేదు. చాలా లాభాలు వచ్చే స్కీమ్స్ ఉన్నాయి, అవి ఇవే అని ఆ వ్యక్తి చెప్పేలోపు నేను నమ్మేశాను . మొదటి నుండి నాకు సంబంధించిన వ్యవహారాలను నా మ్యానేజర్ చూసుకుంటూ వస్తాడు. నా వరకు ఫోన్ రాదు. కానీ ఒక్కసారిగా నా మొబైల్ కి ఫోన్ రావడం తో నమ్మేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
అంతే కాకుండా ఇరాన్ లో తనకు జరిగిన మోసాన్ని కూడా ఈ కార్యక్రమం లో ప్రస్తావించాడు నాగార్జున. ఆయన మాట్లాడుతూ ‘నా బంధువుల్లో ఒకరు షూటింగ్ కోసం ఇరాన్ కి వెళ్ళాడు. విమానాశ్రయం లో దిగిన వెంటనే మాకు ఒక వీడియో కాల్ వచ్చింది. మేము పోలీసులమని చెప్పారు, మీ బ్యాగేజ్ లో మాదకద్రవ్యాలు ఉన్నాయని , మీ రూమ్ నుండి బయటకు రావొద్దని ఆ వీడియో కాల్ లో చెప్పారు. కానీ నాకు అప్పటికే ఈ సైబర్ క్రైమ్ కి గురైన అనుభవం ఉన్నందున నేరుగా ఇరాన్ పోలీసులకు కాల్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ 15 రోజులకు ఒకసారి నా పాస్ వర్డ్స్ మారుస్తూ ఉంటాను. అంతే కాదు , నా మొబైల్ లో ఒక్క ఫోటో కూడా తీసుకోను. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ , ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడం లో మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం లో ఉన్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.