Bajaj CNG Bike: ఆటోమోబైల్ రంగంలో Bajaj కంపెనీకి ఉన్న ప్రత్యేకత వేరు. ఈ కంపెనీ నుంచి ఆకట్టుకునే టూ వీలర్స్ వచ్చాయి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పల్సర్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షించింది. అయితే ఎప్పటికప్పుడు యూత్ ను ఆకర్షించే విధంగా లేటేస్ట్ బైక్స్ ను తీసుకురావడమే బజాజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త మోడల్ బైక్ ను లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు పెట్రోల్ బైక్ లను అందించిన బజాజ్ ఇప్పుడు CNG బైక్ ను తీసుకురాబోతుంది. ఈ విషయాన్ని రాజీవ్ బజాజ్ వెల్లడించారు. ఈ బైక్ ఎలా ఉండనుందంటే?
Bajaj CNG బైక్ టెలీస్కోపిక్ ఫ్రంట్ పోర్క్ తో ఉండనుంది. ఇందులో మోనోషాక్, డిస్క్ డ్రమ్ బ్రేక్ సెటప్ తో పాటు సెక్యూరిటీ రూల్స్ ను పాటించనున్నారు. ఈ బైక్ లో సింగిల్ ఛానెల్, ఏబీఎస్ కాంబి బ్రేకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ కు చెందిన సీఎన్ జీ బైక్ టెస్టింగ్ ను ఇప్పటికే చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయ్యాయి. డ్యూయెల్ ఫ్యూయెల్ సిస్టమ్ సెటప్ తో 100 నుంచి 125 సీసీ ఇంజిన్ ఉండనుంది.
ఈ CNG బైక్ ఫీచర్స్ విషయానికొస్తే.. లిక్విడ్ కూల్డ్ 373 సీసీ ఇంజిన్, 39 బీహెచ్ పీ పవర్, 35 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ యూనిట్ తో ఏబీఎస్ మోడ్ లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. అయితే సీఎన్ జీ బైక్ ధర విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇది మార్కెట్లోకి వస్తే మొట్టమొదటి బజాజ్ సీఎన్ జీ బైక్ గా ఉండనుంది. ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.