Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ కి 2 పులులను తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్.. పూర్తి వివరాలు...

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ కి 2 పులులను తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , వివిధ శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ దేశం లోనే నెంబర్ 1 స్థానం లో ఉంది. ఈ రెండేళ్ల కాలం లో ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని కూడా ఆ శాఖకి రప్పించేలా పని చేశారు పవన్ కళ్యాణ్. అదే విధంగా పర్యావరణ శాఖపై ఆయన ప్రత్యేక ద్రుష్టి పెడుతూ , వచ్చే ఏడాది లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక అటవీ శాఖ కి సంబంధించి ఆయన ఎలాంటి మార్కు చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ పవన్ కళ్యాణ్ పాలనలో 80 శాతం తగ్గింది. అంతే కాదు అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే రైతుల పొలాల్లోకి ఏనుగులు ప్రవేశించి పంటలను ద్వంసం చేస్తున్నాయి.

ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ , కర్ణాటక రాష్ట్రము నుండి రెండు కుంకీ ఏనుగులను తెప్పించారు. వీటి ద్వారా ఇది వరకు ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ ని నిర్వహించారు. అయితే మన ఆంధ్ర ప్రదేశ్ లో పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర నుండి రెండు ఆడపులులను రప్పిస్తున్నారు. ఈమేరకు నిన్న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తో భేటీ అయ్యారు. ఆయన పులులను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే వీటిని ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా చెప్పనున్నారు. ఇలా తన శాఖలన్నిటికీ సంపూర్ణ న్యాయం చేస్తూ, నాయకుడు అంటే ఎలా ఉండాలో అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై అభిమానుల్లో కాస్త ఆందోళన వాతావరణం నెలకొంది.

చాలా కాలం నుండి భుజాల నొప్పితో బాధ పడుతున్న ఆయన, నిన్న ముంబై లోని ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మహారాష్ట్ర సీఎం తో భేటీ అయ్యారు. వైద్యులు పవన్ కళ్యాణ్ ని తక్షణమే సర్జరీ చేయించుకోవాలని , గాయం తీవ్ర రూపం దాల్చిందని అంటున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత , సర్జరీ చేయించుకుంటానని ఆయన డాక్టర్లకు చెప్పారట. దీంతో అభిమానుల్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల కాస్త టెన్షన్ మొదలైంది. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రం షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఒకపక్క రాజకీయంగా , మరోపక్క సినిమాల పరంగా ఫుల్ యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే పరిస్థితి ఏంటి?, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper