Amaravati: మనం పుట్టగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఫలానా వాళ్ళ బాబు లేదా పాప అని.. ఫలానా ఇంటి పేరని.. ఫలానా ఊరు అని.. ఒక వ్యక్తికి సంబంధించి ఇన్ని విధాలుగా చిరునామాలు ఉండడం ఎంత సహజమో.. ఒక రాష్ట్రానికి రాజధాని ఉండడం కూడా అంతే సహజం.
ఏపీ దరిద్రం ఏంటంటే.. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేని దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. 2024 ఎన్నికల్లో మార్పు అని అధికారంలోకి వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశాడు. పైగా మూడు రాజధాని లోని పల్లవి అందుకున్నాడు. చివర్లో విశాఖపట్నం రాజధాని అంటూ కబుర్లు చెప్పాడు. అక్కడ ఉన్న రిషికొండను తొలచి స్వర్గధామం లాంటి భవంతి కట్టుకున్నాడు.
జగన్ పోకడలు చూసి జనం 11 సీట్లకు పరిమితం చేశారు. చంద్రబాబు నేతృతంలో కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పడావు పడిన రాజధానిని మళ్లీ పట్టాలు ఎక్కించారు. ఈసారి అదృష్టం కొద్దీ కేంద్రంలో టిడిపికి ముఖ్యపాత్ర పోషించే అవకాశం లభించింది. ఫలితంగా రాజధాని నిర్మాణానికి భారీగా డబ్బులు మంజూరు అవుతున్నాయి. రాజధాని నిర్మిత అమరావతి ప్రాంతంలో పెద్దపెద్ద భవనాలు కడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో తొలి దశ రాజధాని ప్రారంభించబోతున్నారు. ఇది శుభసూచకం. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఒక గర్వకారణమైన విషయం.
మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని ఏంటో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ ప్రజలది. చివరికి చంద్రబాబు వల్ల అమరావతికి ఒక గుర్తింపు వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. కేంద్రం సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఫలితంగా అక్కడ నిర్మాణాలు వేగంగా సాగిపోతున్నాయి. చివరికి అమరావతి అంటే ఏంటో లడక్ ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇటీవల ఒక యూట్యూబర్ లడక్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పిల్లలు మొహరం సందర్భంగా ఉచితంగా సేమియా పంపిణీ చేస్తున్నారు. అక్కడ పర్యటిస్తున్న యూట్యూబర్ కూడా ఆ పిల్లలు అందించిన సేమియా తిన్నారు. కుశల ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూట్యూబర్ ను మీ ప్రాంతం ఏది అని అడిగితే .. ఆంధ్రప్రదేశ్ అని సమాధానం చెప్పారు. దీంతో ఆ పిల్లలు ఆనందపడి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని బదులు ఇచ్చారు. దీనికి ఆ యూట్యూబర్ సంతోషపడ్డాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. దీనిని సహజంగానే టిడిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో విస్తృతంగా తిప్పుతున్నారు. ఇక్కడ అమరావతి పేరు వినిపించిందో వైసిపికి అది బూతు లాగా అనిపించింది. ఇంకేముంది అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో.. మీడియా గ్రూపులలో విషం చిమ్మడం మొదలుపెట్టింది. అది ఏఐ వాయిస్ అని.. ఆ పిల్లలకు అమరావతి అంటే ఎలా తెలుస్తుందని.. చివరికి దీనిని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో టిడిపి నేతలు రంగంలోకి దిగారు. సదరు యూ ట్యూబర్ ను తెరమీదకు తీసుకొచ్చారు. ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నారు.
ఒక రాష్ట్రానికి రాజధాని ఉండడం అనేది అత్యంత ముఖ్యం. తాడేపల్లిలో.. యలహంకలో.. లోటస్ పాండ్ లో పెద్దపెద్ద భవంతులు కట్టుకున్న వ్యక్తికి రాజధాని నిర్మించాలని సోయి లేకపోవడం దురదృష్టకరం. ఆయన మాట్లాడుతున్న మావిగన్ మాటలకు వంత పాడుతున్న వారికి పెద్ద దండం.. నిజానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించడం అంటే మాటలు కాదు. ఇటువంటి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు శతకోటి నమస్కారాలు పెట్టాల్సిందే. పైగా ఆయన తీరును సమర్థిస్తున్న నాయకులకు పెద్ద పెద్ద పురస్కారాలు ఇవ్వాల్సిందే..