Homeఎంటర్టైన్మెంట్Tollywood controversies: వివాదాల్లో చిక్కుకొని కెరియర్ ను కోల్పోయిన యంగ్ హీరోస్...

Tollywood controversies: వివాదాల్లో చిక్కుకొని కెరియర్ ను కోల్పోయిన యంగ్ హీరోస్…

Tollywood controversies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం కీలకం. ఒకసారి విజయం సాధించిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఇండస్ట్రీ లో ఎన్నో వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటిని తట్టుకొని నిలబడగలగాలి అలాగే ఏ కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అంతేతప్ప మనం హీరోలం కదా ఇది చేసిన నడుస్తుందని బలుపు చూపిస్తే మాత్రం వారిని షెడ్డుకి పంపిస్తారు. కొన్ని కాంట్రవర్సీల్లో, పర్సనల్ వివాదాల్లో […]

Tollywood controversies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం కీలకం. ఒకసారి విజయం సాధించిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఇండస్ట్రీ లో ఎన్నో వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటిని తట్టుకొని నిలబడగలగాలి అలాగే ఏ కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అంతేతప్ప మనం హీరోలం కదా ఇది చేసిన నడుస్తుందని బలుపు చూపిస్తే మాత్రం వారిని షెడ్డుకి పంపిస్తారు. కొన్ని కాంట్రవర్సీల్లో, పర్సనల్ వివాదాల్లో చిక్కుకొని చాలామంది హీరోలు ఇప్పటికే తమ కెరీర్ ని కోల్పోయారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ లాంటి నటుడు చిరంజీవి బిడ్డతో తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుంచి ఆయన కెరీర్ అయితే అంత సాఫీగా సాగలేదు. ఫైనల్ గా ఆయన చనిపోవడానికి కూడా కారణమైందని చాలామంది చెబుతుంటారు.

తరుణ్ లాంటి నటుడు సైతం ఆర్తి అగర్వాల్ తో చాలా సినిమాలు చేశాడు. ఆర్తి అగర్వాల్ మాత్రం తరుణ్ ను ప్రేమిస్తున్నానని మా పెళ్లి కాకుండా వాళ్ళ అమ్మ అడ్డుకుంటుందని చెప్పి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాంతో తరుణ్ చాలావరకు బ్యాడ్ అయ్యాడు. ఆ విధంగా అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేశారు. ఫైనల్ గా తన మార్కెట్ ని కోల్పోయాడు. ఇక హీరోగా కూడా అవకాశాలు రాకపోవడంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నాడు…

ఇక యూట్యూబ్ లో ఒక పెను సంచలనంగా మారిన షణ్ముఖ్ జస్వంత్ సైతం హీరోగా మారి ఒకటి రెండు సినిమాలు చేశాడు. అప్పుడప్పుడే అతనికి క్రేజ్ వస్తున్నప్పటికి కొంతమందితో ప్రేమ వ్యవహారాలు నడిపి అవన్నీ బట్టబయలు కావడంతో ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక దానికి తోడుగా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఆయన నడిపిన కారు ఒక యాక్సిడెంట్ కు గురయ్యింది. ఇవన్నీ జరగడంతో ప్రేక్షకులు అతని నమ్మడం మానేశారు. ఫైనల్ గా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటున్నప్పటికి ఆయనకి రావాల్సిన గుర్తింపైతే రావడం లేదు…

ఇక ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్న అఖిల్ రాజ్ సైతం ఈరోజు ఒక డెలివరీ బాయ్ ని కొట్టాడు. దాంతో అతని మీద కూడా విపరీతంగా నెగెటివిటి స్ప్రెడ్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక సక్సెస్ వచ్చినప్పుడు చాలా డీసెంట్ గా ఉంటూ ఆ స్టార్ డమ్ ను సరిగ్గా వాడుకోవాలి.

అలాంటప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతారు. ఇక డెలివరీ బాయ్ ను కొట్టిన అఖిల్ రాజ్ పరిస్థితి ఏంటి ఆయన ఇలాగే వివాదాల్లో చిక్కుకుంటే మాత్రం తన కెరీర్ కూడా కోల్పోవాల్సిన ప్రమాదమైతే రావచ్చు అంటూ సినిమా మేధావులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper