Homeఎంటర్టైన్మెంట్Sudha Kongara: రెమ్యూనరేషన్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన సూర్య మూవీ డైరెక్టర్.. అసలు ఏమి...

Sudha Kongara: రెమ్యూనరేషన్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన సూర్య మూవీ డైరెక్టర్.. అసలు ఏమి జరిగిందంటే..

Sudha Kongara: సౌత్ ఇండియా లో లేడీ డైరెక్టర్స్ లో మంచి ఫేమ్ ఉన్న వారిలో ఒకరు సుధా కొంగర. గతం లో ఈమె తమిళం లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది. వాటిల్లో మాధవన్ తో చేసిన ‘ఇరుద్ది సుత్రు ‘ అనే చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తెలుగు లో ‘గురు’ అనే టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి కూడా సుధా కొంగరు […]

Sudha Kongara: సౌత్ ఇండియా లో లేడీ డైరెక్టర్స్ లో మంచి ఫేమ్ ఉన్న వారిలో ఒకరు సుధా కొంగర. గతం లో ఈమె తమిళం లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది. వాటిల్లో మాధవన్ తో చేసిన ‘ఇరుద్ది సుత్రు ‘ అనే చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తెలుగు లో ‘గురు’ అనే టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి కూడా సుధా కొంగరు నే దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత తమిళం లో సూర్య తో తీసిన ‘సూరరై పోట్రు ‘ అనే చిత్రం నేరుగా కరోనా కారణంగా నేరుగా ఓటీటీ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో ఈ చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్ తో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత ఈమె ఇదే చిత్రాన్ని హిందీ లో అక్షయ్ కుమార్ ని హీరో గా పెట్టి రీమేక్ చేసింది. అక్కడ మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈమె దర్శకత్వం లో తెరకెక్కిన ‘పరాశక్తి’ విడుదలైంది. శివ కార్తికేయన్ , శ్రీలీల హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం లో జయం రవి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి ఆకాష్ భాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈయన ఇప్పటి వరకు సుధా కొంగారు కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. సినిమా విడుదలై నేటికీ ఆరు నెలలు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట.

ఒప్పందం ప్రకారం సుధా కి నిర్మాత 8 కోట్ల 39 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమా విడుదలై ఫ్లాప్ అయినప్పటికీ, నిర్మాతకు ఎలాంటి నష్టం కలగలేదు, ఎందుకంటే ఓటీటీ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయింది కాబట్టి. నష్టాలు వచ్చి ఉండుంటే సుధా బహుశా ఇంత పెద్ద రచ్చ చేసేది కానీ , కానీ లాభాలు వచ్చినప్పటికీ కూడా తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం వల్ల, ఆమె మద్రాసు హై కోర్టుని ఆశ్రయించింది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ సమస్యని చాలా సమరస్యంగానే పరిష్కరించుకోవాలని సుధా కొంగారు ప్రయత్నం చేసింది. కానీ నిర్మాత నుండి ఎలాంటి స్పందన లేదు , దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. మరి కోర్టు ఈ లేడీ డైరెక్టర్ కి న్యాయం చేస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper