Getup Srinu: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందుల గెటప్ శ్రీను పేరు ముందు వరుస లో ఉంటుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 వ సంవత్సరం నుండే గెటప్ శ్రీను సినిమాల్లో అడపాదడపా నటిస్తూ వచ్చాడు. కానీ ఆయన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం మాత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ఈ చిత్రం తర్వాత గెటప్ శ్రీను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది ఆయన నుండి భర్త మహాశయులకు విజ్ఞప్తి , నారీ నారీ నడుమ మురారి, సరస్వతి, రాకాస, జెట్లీ , లెనిన్ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ఆయన నాలుగైదు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తూ బిజీ గా ఉన్నాడు.
అందులో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ చిత్రం కూడా ఉండడం విశేషం. ఇదంతా పక్కన పెడితే 2024 వ సంవత్సరం లో గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ , కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా ఫలితం పై గెటప్ శ్రీను చాలా నిరాశకు గురయ్యాడు అట. సినిమా చాలా బాగా వచ్చింది , బహుశా నేను జనసేన పార్టీ కి సపోర్టు చేయడం వల్ల , ఒక వర్గం ప్రేక్షకులు దూరం అయ్యారా?, అందుకే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదా ?, రాజకీయంగా స్టాండ్ తీసుకొని తప్పు చేసానేమో అని ఆయన బాధపడ్డాడు అట. ఈ విషయాన్ని అప్పట్లో ప్రముఖ కమెడియన్ ధనరాజు ట్విట్టర్ స్పేస్ లో చెప్పుకొచ్చాడు.
అయితే 2024 తర్వాత గెటప్ శ్రీను కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏ రేంజ్ కమెడియన్ అంటే , రోజుకి 3 లక్షల రూపాయిలు అందుకునే రేంజ్ కమెడియన్ అన్నమాట. ఈ స్థాయికి రావడానికి గెటప్ శ్రీను చాలానే కష్టపడ్డాడు. ఆ కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసొచ్చింది. కట్ చేస్తే రెండేళ్లలో టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ కమెడియన్స్ లో ఒకడిగా మారిపోయాడు. మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన కెరీర్ ఇదే రేంజ్ లో కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.