Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: టీవీ9 ను పక్కన పెట్టి..బిగ్ టీవీకి దగ్గరగా.. జగన్ సంచలన నిర్ణయం..

Andhra Pradesh: టీవీ9 ను పక్కన పెట్టి..బిగ్ టీవీకి దగ్గరగా.. జగన్ సంచలన నిర్ణయం..

Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీవీ9 ఛానల్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావ్ కుమారుడు అనిల్ టీవీ9 లో చేరారు. గతంలో అనిల్ టిడిపిలో కీలక శాఖలో పనిచేశారు. తెర వెనుక డిజిటల్ వ్యవహారాలను.. సోషల్ మీడియా వ్యవహారాలను పరిశీలించారు. టీవీ9లో అనిల్ చేరిపోవడంతో.. ఆ ఛానల్ వ్యవహారాలు పూర్తిగా మారిపోతున్నాయి. గతంలో వైసిపికి అనుకూలమైన ధోరణి ప్రదర్శించిన టీవీ9.. క్రమేపి తన పొలిటికల్ లైన్ మార్చుకుంటున్నది. […]

Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీవీ9 ఛానల్ లో సమూల మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావ్ కుమారుడు అనిల్ టీవీ9 లో చేరారు. గతంలో అనిల్ టిడిపిలో కీలక శాఖలో పనిచేశారు. తెర వెనుక డిజిటల్ వ్యవహారాలను.. సోషల్ మీడియా వ్యవహారాలను పరిశీలించారు.

టీవీ9లో అనిల్ చేరిపోవడంతో.. ఆ ఛానల్ వ్యవహారాలు పూర్తిగా మారిపోతున్నాయి. గతంలో వైసిపికి అనుకూలమైన ధోరణి ప్రదర్శించిన టీవీ9.. క్రమేపి తన పొలిటికల్ లైన్ మార్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆ ఛానల్ నుంచి గట్టి సపోర్ట్ లభించడం కష్టమని జగన్ అంచనాకు వచ్చారు. దీంతో తమ రాజకీయ ఎజెండాను మరింత గొప్పగా ప్రచారం చేసుకోవడానికి.. కూటమి ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు చేయడానికి.. ప్రత్యామ్నాయ ఆలోచనలను సిద్ధం చేసుకున్నారు.

ఏ ఛానల్ కైనా సరే ప్రైమ్ స్లాట్లు చాలా విలువైనవి. ఇప్పుడు బిగ్ టీవీ ప్రైమ్ స్లాట్లను వైసీపీ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించే ఈహా టీవీ నిర్వాహకుడు నరసింహారావుకు బిగ్ టివిలో ప్రతి వారానికి ఒక ప్రత్యేకమైన స్లాట్ కేటాయించినట్టు తెలుస్తోంది . డిజిటల్ వేదికలలో వైసిపికి అనుకూలంగా విశ్లేషణలు చేసే వ్యక్తులను తెర మీదకి తీసుకురావడం.. కూటమినేతలకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేయడంలో నరసింహారావుకు మంచి పేరుంది. అయితే యూట్యూబ్ పరిధిలో పనిచేస్తున్న ఆయనకు నేరుగా సాటిలైట్ ఛానల్ ద్వారా మెయిన్ మీడియా ఆడియన్స్ లోకి వైసిపి భావజాలాన్ని ఎక్కించాలని .. ఈ స్లాట్ ద్వారా ఆ పని జరగాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ నర్సింహారావు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఈయన అనేక సున్నితమైన అంశాలపై ఎటువంటి ఆధారాలు లేకుండానే వార్తలను.. కథనాలను ప్రసారం చేశారు. దీనిపై ఏపీ.. తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. నరసింహారావు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. కేవలం వ్యూస్.. పొలిటికల్ ప్రయోజనాలు మాత్రమే లక్ష్యంగా ఈహా టీవీని నరసింహారావు నడుపుతున్నారు. అయితే ఈ వ్యక్తిని ఇప్పుడు బిట్టివి ఇలాంటి ఛానల్లో కూర్చోబెట్టి.. వారానికి ఒకసారి విశ్లేషణ చేస.. చంద్రబాబు ప్రభుత్వం పై బురద చల్లడానికి సరికొత్త ప్రచార అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

నరసింహారావు తోనే ఇది ఆగి పోయే విధంగా కనిపించడం లేదు. వచ్చే రోజుల్లో మరి కొంతమంది యూట్యూబర్లు. వైసిపి ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా బిగ్ టీవీ లోకి ప్రవేశించబోతున్నారు. వీరికి భారీ ప్యాకేజీలు ముట్టబోతున్నాయి.. సాక్షి పేపర్ ఫ్లాఫ్ అయింది. ఛానల్ కూడా అంతంత మాత్రమే.. ఈ నేపథ్యంలోనే న్యూట్రల్ ముసుగుతో నడుస్తున్న శాటిలైట్ ఛానల్స్ లో స్లాట్లు కొనుగోలు చేస్తే ఫాయిదా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. కానీ మీడియా అనేది జనాలను ప్రభావితం చేయలేదని విషయాన్ని జగన్ గుర్తించకపోవడం ఇక్కడే అసలైన విచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper