Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు డీఎస్సీ 2025 చుట్టూ తిరుగుతున్నాయి. నిన్ననే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణ ఇస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాల్ విసిరారు. ఇప్పటికే మూడుసార్లు సవాల్ చేశానని.. ఇప్పుడు నాలుగో సారి చేస్తున్నానని.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కోరారు. డీఎస్సీ 2025 పారదర్శకంగా పూర్తి చేసామని వివరించారు. అటు మండలిలో సైతం డీఎస్సీ మంటలు రేగాయి. మంత్రి అచ్చం నాయుడు వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్టు పరిస్థితి మారింది. పరస్పరం గట్టి ఆరోపణలు చేసుకున్నారు ఆ ఇద్దరు నేతలు. అక్కడ కూడా మంత్రి అచ్చం నాయుడు పూర్తి స్పష్టత ఇచ్చారు డీఎస్సీ 2025 పై. అయితే ఈరోజు శాసనసభలో సీఎం చంద్రబాబు డిఎస్సి 2025 పై మాట్లాడారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా.. స్వార్థ రాజకీయాల కోసం డీఎస్సీ 2025 పై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీతో కూటమి ప్రభుత్వం పట్ల వ్యక్తం అయిన క్రెడిట్ ను రాకుండా చేసేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
* చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం..
శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు చంద్రబాబు. స్పోర్ట్స్ కోటాలో.. కేంద్రం మార్గదర్శకాలకు అనుసరించి అన్ని క్రీడలకు అవకాశం ఇస్తే.. పేకాట ఆడే వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారటు ఓ మాజీ మంత్రి విపరీత వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ ను గుర్తు చేశారు చంద్రబాబు. కనీస స్పృహ లేకుండా.. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ఒక నేత బాధ్యతగా మాట్లాడలేదని తప్పుపట్టారు. అదో సైకో పార్టీ అని.. అధినేత అలా ఉంటే.. మిగతా వారు ఎలా ఉంటారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ పై కుట్రలు చేస్తున్నా.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తేల్చి చెప్పారు.
ఇంకోవైపు డీఎస్సీ ల నిర్వహణలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో 80% టిడిపి ప్రభుత్వాలు భర్తీ చేసిన వారని గుర్తు చేశారు. 14 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే.. అందులో 11 సార్లు తాను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు.
* 1994 డీఎస్సీలో 16,238 పోస్టులు భర్తీ చేశారు
* 1996 డీఎస్సీలో 16,838 పోస్టులు..
* 1998లో 29269 పోస్టులు
* 2000 డీఎస్సీలో 24388 పోస్టులు
* 2001 డిఎస్సి లో 26,129 పోస్టులు
* 2002 డీఎస్సీలో 31 699 పోస్టులు
* 2003 డీఎస్సీలో 12,430 పోస్టులు
* 2014 డీఎస్సీలో 8926 పోస్టులు
* 2018లో డీఎస్సీలో 7254 పోస్టులు
* 2025 డీఎస్సీలో 16,347 పోస్టులు భర్తీ చేసినట్లు చంద్రబాబు సభలో ప్రకటించారు.
* ఇక స్పెషల్ డిఎస్సి కి సంబంధించి 1995లో 3706 పోస్టులు.. 1997లో 8743 పోస్టులు.. ఇలా మొత్తం 1,96,619 పోస్టులను భర్తీ చేసినట్లు చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram