Narendra Modi: ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం కీలకంగా ఉంది. దీని నుంచి బయటపడే ప్రయత్నాలు పలు దేశాల్లో కొనసాగుతున్నాయి. భారత్ ఈ క్రమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మోదీపై అమెరికాకు ద్వేషం. ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ఇండియా ఫస్ట్’’ విధానాన్ని అనుసరిస్తూ అంతర్జాతీయ సంబంధాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం కూడా అమెరికా, అమెరికా డీప్ స్టేట్‌కు నచ్చదు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ వేదిక, స్థానిక కరెన్సీ వాణిజ్యం, రాబోయే సమావేశాలు చర్చనీయాంశాలుగా మారాయి.
డీ–డాలరైజేషన్ ప్రయత్నాలు..
డాలర్ ఆధారిత వ్యవస్థ నుంచి బయటకు రావాలనే లక్ష్యంతో పలు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. బ్రిక్స్ ఈ దిశగా ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చెందింది. ఐదు దేశాలు ఉన్న బ్రిక్స్‌లో ఇటీవల సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ వంటి దేశాలు చేరాయి. ఇండోనేషియా కూడా ఈ గ్రూపులో భాగమైంది. ఈ దేశాల మధ్య అంతర్గత వైరుధ్యాలు ఉన్నప్పటికీ స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెంచుకోవాలనే లక్ష్యం ఉమ్మడిగా కనిపిస్తోంది.
ఇప్పటికే డాలర్ రహిత వ్యాపారం..
భారత్ ఇప్పటికే రష్యాతో రూబుల్స్‌లో, యూఏఈతో దిర్హామ్‌ల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. మరికొన్ని దేశాలతో కూడా డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీ ఆధారిత లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రిక్స్ వేదిక ద్వారా డిజిటల్ కరెన్సీ, సాధారణ ప్రొటోకాల్స్ వంటి అంశాలపై చర్చలు జరగడం సహజం. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న సమావేశం ఈ దిశగా మరో అడుగు. యూరోపియన్ దేశాల చేరికపై బ్రిక్స్ సభ్యుల్లో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
స్వతంత్ర విదేశాంగ విధానం..
భారత్ తన జాతీయ ప్రయోజనాలను ముందుంచుకుని నిర్ణయాలు తీసుకోవడం కొన్ని శక్తులకు సౌకర్యవంతంగా లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య వర్గాలతో సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇది డాలర్ ఆధిపత్యానికి సవాలుగా మారుతుందని పలువురు భావిస్తునానరు. అయితే ఇటువంటి మార్పులు ఒక్కసారిగా జరగవు. అవి నెమ్మదిగా, ఆర్థిక శక్తి సమతుల్యత మారినప్పుడే సాధ్యమవుతాయి.
సమావేశాల సందర్భంగా అల్లర్లకు ప్లాన్..
సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు సభ్యదేశాల ప్రతినిధులు హాజరవుతారు. పెద్ద అంతర్జాతీయ సమావేశాల సమయంలో దేశంలో నిరసనలు, రాజకీయ కార్యకలాపాలు జరగడం కొత్త కాదు. గతంలో ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతాపార్టీ అధినేత రాబోయే బ్రిక్స్ సమావేశం సమయంలో నిరసనలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన వెనుక అమెరికా ఉంది. బ్రిక్స్ సదస్సును విఫలం చేయడమే లక్ష్యంగా సెప్టెంబర్ 10 నిరసన చేపట్టబోతున్నాడు అభిజిత్. 11న అల్లర్లు,12, 13 తేదీల్లో తీవ్రమైన అల్లర్లు జరిపి ప్రపంచ దేశాల ముందు భారత పరువు తీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది అమెరికా. ఇందులో అభిజిత్‌ను పావుగా వాడుకోవాలని చూస్తోంది.
బ్రిక్స్ వేదిక ద్వారా ఆర్థిక సహకారం పెరగడం భారత్‌కు అవకాశాలు సృష్టిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లు, దేశీయ రాజకీయ సవాళ్లు కూడా ఉంటాయి. స్వతంత్ర విధానం కొనసాగించాలంటే దృఢమైన ఆర్థిక పునాది, దౌత్య నైపుణ్యం, అంతర్గత స్థిరత్వం అవసరం. రాబోయే రోజుల్లో జరగనున్న సమావేశాలు, వాటి చుట్టూ జరిగే చర్చలు ఈ దిశగా ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.