Homeఆంధ్రప్రదేశ్‌AP DSC recruitment: మాజీ సైనికుడు ఉపాధ్యాయుడైతే.. సాక్షికి ఎందుకింత మంట..

AP DSC recruitment: మాజీ సైనికుడు ఉపాధ్యాయుడైతే.. సాక్షికి ఎందుకింత మంట..

AP DSC recruitment: సాక్షి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. పాత్రికే విలువలు మర్చిపోతున్నది. దిగజారి వార్తలను ప్రసారం చేస్తున్నది. చివరికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని బెదిరిస్తున్నది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోలేకపోతున్నది… ఒక మాజీ సైనికుడు.. దేశ సరిహద్దుల్లో పోరాటం చేసిన వ్యక్తి.. టీచర్ ఉద్యోగం సాధిస్తే ఓర్చుకోలేకపోతున్నది. దారుణంగా విషం చిమ్ముతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని సాక్షాత్తు ఆంధ్ర […]

AP DSC recruitment: సాక్షి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. పాత్రికే విలువలు మర్చిపోతున్నది. దిగజారి వార్తలను ప్రసారం చేస్తున్నది. చివరికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని బెదిరిస్తున్నది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే తట్టుకోలేకపోతున్నది… ఒక మాజీ సైనికుడు.. దేశ సరిహద్దుల్లో పోరాటం చేసిన వ్యక్తి.. టీచర్ ఉద్యోగం సాధిస్తే ఓర్చుకోలేకపోతున్నది. దారుణంగా విషం చిమ్ముతున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. చివరికి వైసిపి కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానం దానిని మొహమాటం లేకుండా కొట్టేసింది. ఇటువంటి పనికిమాలిన పిటిషన్లు వేసి.. తమ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తారని కోర్టు తీవ్రంగా మండిపడింది. వాస్తవానికి డీఎస్సీ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. అన్ని విభాగాలలో అత్యంత క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. అర్హులైన వారికి మాత్రమే ఉద్యోగాలు కేటాయించింది. ఏపీ డీఎస్సీ ప్రక్రియ అత్యంత సజావుగా జరగడంతో చాలామంది పేద.. దిగువ మధ్య తరగతికి చెందినవారు ఉద్యోగాలు సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే కష్టపడి చదివిన వారికి సర్కారు కొలువు లభించింది.

ఈ స్థాయిలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగితే సాక్షి ఓర్చుకోలేకపోతున్నది. పైగా ఉద్యోగాలు సాధించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఒకరకంగా పాత్రికేయ విలువలు మర్చిపోయి.. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో ఉపాధ్యాయులను బెదిరిస్తున్నది. చివరికి సాక్షి తీరు ఎంతకు దిగజారింది అంటే.. దేశ సరిహద్దుల్లో తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పక్కనపెట్టి సేవలందించిన మాజీ సైనికుడి పై విషం చిమ్ముతుంది. ఒక మాజీ సైనికుడు పై.. భావిభారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై సాక్ష్యం మీడియా ప్రతినిధులు చిందులు తొక్కారు. అరాచకానికి పాల్పడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు చిన్నారులకు ఆ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్న సమయంలో తరగతి గదిలోకి వెళ్లి.. అక్రమంగా చొరబడ్డారు. అతని చొక్కా పట్టుకొని ప్రాణ బ్యాంక్ కలిగించే లాగా బెదిరించారు. పాత్రికేయ విలువలను భూస్థాపితం చేశారు. రౌడీయిజం.. గుండాయిజంతో బెదిరింపులకు పాల్పడ్డారు.

దేశ సరిహద్దుల్లో భారత సైన్యంలో హవాల్దార్ గా పనిచేశారు చక్రపాణి రెడ్డి. పేద కుటుంబానికి చెందిన ప్రతిరోజు 16 గంటల పైగా కష్టపడి చదివారు. మెగా డీఎస్సీలో ప్రతిభ చూపించి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉపాధ్యాయుడి ఉద్యోగం సాధించారు. ప్రస్తామైన కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే చక్రపాణి రెడ్డి ఉద్యోగం సాధించడానికి తట్టుకోలేని సాక్షి మీడియా ప్రతినిధులు ఆయనను టార్గెట్ చేశారు. కక్షగట్టి వేధించడం మొదలుపెట్టారు. అక్రమంగా పాఠశాలలకు ప్రవేశించి.. సర్టిఫికెట్లను చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బెదిరించారు. విద్యార్థుల ముందే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగారు. ఒక సైనికుడు విషయంలో సాక్షి మీడియా ప్రతినిధులు చేసిన దుర్మార్గాన్ని యావత్ ఏపీ ప్రజలు చూశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నియమించారు. చివరికి ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారు. కానీ ఇప్పుడు డీఎస్సీ నిర్వహించి.. ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే తట్టుకోలేక.. చివరికి ఇలాంటి చిల్లర రాతలు రాస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper