Homeఆంధ్రప్రదేశ్‌BIG TV: అందుకే రాజీనామా.. బిగ్ టీవీ అశోక్ బయటపెట్టిన సంచలన నిజాలు

BIG TV: అందుకే రాజీనామా.. బిగ్ టీవీ అశోక్ బయటపెట్టిన సంచలన నిజాలు

BIG TV: ఏపీలో జరిగిన డీఎస్సీ వ్యవహారం మీద బిగ్ టివి ఇటీవల వరుసగా సంచలన కధనాలను ప్రసారం చేసింది. డీఎస్సీ వ్యవహారంలో ఏదో జరిగిందని… అనర్హులకు పోస్టులు ఇచ్చారని.. డీఎస్సీ ప్రక్రియను మొత్తం అపహాస్యం చేశారని బిగ్ టీవీలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చింది. నిజాలను బయటపెడితే వచ్చింది. ఈ క్రమంలో బిగ్ టీవీ లో ఎడిటర్ స్థాయి ఉద్యోగంలో పనిచేస్తున్న వేములపల్లి అశోక్ తన […]

BIG TV: ఏపీలో జరిగిన డీఎస్సీ వ్యవహారం మీద బిగ్ టివి ఇటీవల వరుసగా సంచలన కధనాలను ప్రసారం చేసింది. డీఎస్సీ వ్యవహారంలో ఏదో జరిగిందని… అనర్హులకు పోస్టులు ఇచ్చారని.. డీఎస్సీ ప్రక్రియను మొత్తం అపహాస్యం చేశారని బిగ్ టీవీలో కథనాలు వచ్చాయి.

ఈ కథనాలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వచ్చింది. నిజాలను బయటపెడితే వచ్చింది. ఈ క్రమంలో బిగ్ టీవీ లో ఎడిటర్ స్థాయి ఉద్యోగంలో పనిచేస్తున్న వేములపల్లి అశోక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామా వెనుక ఏదో జరిగి ఉంటుందని ప్రచారం మొదలైంది. ఆయన రాజీనామా వెనుక టిడిపి ఒత్తిడి ఉందని.. వైసిపి.. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలలో వాస్తవం లేదని దాని వెనుక వైసిపి ఉందని టిడిపి ఇలా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.

దీనిపై వేములపల్లి అశోక్ క్లారిటీ ఇచ్చారు. తను కొంతకాలంగా మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నానని.. దానికి తోడు వెన్ను నొప్పి సమస్య కూడా వేధిస్తోందని.. వీటికోసం మందులు వాడుతున్నానని.. పైగా కొత్తగా వచ్చిన ఫార్మాట్ ప్రకారం నాలుగు గంటల పాటు నిలబడి వార్తలు చెప్పాల్సి వస్తోందని.. గట్టిగా అరవడం వల్ల నరాలు దెబ్బతింటున్నాయని.. దీంతో వైద్యుల సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లానని అశోక్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ వ్యవహారం వల్ల కాస్త రాజీనామా విషయం ఆలస్యమైందని.. డీఎస్సీ వార్తలను బిగ్ టీవీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఏపీలో ఐఏఎస్ అధికారులు విలేకరుల ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారని.. ఇదే విషయం బిగ్ టివి యాజమాన్యానికి చెప్తే.. ఆయన రాజీనామాను ఆమోదించిందని అశోక్ చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఆయన రాజీనామా వెనుక జరుగుతున్న ప్రచారాన్ని అశోక్ వేములపల్లి కొట్టి పారేశారు. రాజీనామా వెనుక ఎవరూ లేరని.. అనవసరమైన ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. తన ఆరోగ్యం బాగోలేక ఉద్యోగానికి రాజీనామా చేశానని.. ఇది ఎప్పటినుంచో చెబుతున్న విషయమని.. చివరికి ఇన్నాళ్లకు తాను రాజీనామా చేశానని అశోక్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఆయన రాజీనామా వెనుక జరుగుతున్న అసలు ప్రచారానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. అశోక్ రాజీనామా తర్వాత బిగ్ టీవీలో పని చేస్తున్న మరోకీలక ఉద్యోగి కూడా తన జాబ్ కు రిజైన్ చేశారు. దీంతో ఆ చానల్ లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper