AP DSC recruitment: దాపు 5 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూశారు. ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. పైగా టీచర్లను మద్యం షాపుల వద్ద నియమించారు. ఇది టీచర్ లోకాన్ని మొత్తం భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో 2024 ఎన్నికల్లో మార్పు కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ మీద సంతకం చేశారు. దానికి తగ్గట్టుగానే నారా లోకేష్ టీచర్ నియామకాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా యుద్ధ ప్రాతిపదికన టీచర్ నియామకాలను చేపట్టారు. పేద.. దిగువ మధ్యతరగతి చెందిన వారికి ఉద్యోగ కలను నారా లోకేష్ సాకారం చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను.. గతంలో ప్రభుత్వ రూపొందించిన విధానాలను నూటికి నూరు శాతం అమలు చేశారు.
ఈ విషయంలో వైసిపి వితండవాదాన్ని భుజానికి ఎత్తుకుంది. సొంత మీడియా చేతిలో ఉండడంతో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. ఏపీ డీఎస్సీ ఉద్యోగ నియామక ప్రక్రియలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని ఆరోపించడం మొదలు పెట్టింది. వైసిపి కోర్టుకు వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయినప్పటికీ వైసీపీ వితండవాదాన్ని.. విష ప్రచారాన్ని చేస్తూనే ఉంది. పైగా కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు.. కొత్తగా ఉద్యోగ నియామకాలను పొందిన ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారంతా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
పేపర్ లీక్ అని కొద్దిరోజులు.. ఆ తర్వాత స్పోర్ట్స్ కోట అని కొద్దిరోజులు.. రిజర్వేషన్ల అంశాలు అని మరికొద్ది రోజులు.. ఇలా వైసిపి తెగ హడావిడి చేసింది. చివరికి ఉద్యోగం కూడా పొందని వేమూరి రామకృష్ణ అనే యువకుడికి ఉద్యోగం వచ్చిందని విష ప్రచారం చేసింది. చివరికి అతడు మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పడంతో సాక్షి తలదించుకుంది. అయినప్పటికీ కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు ఏమాత్రం తగ్గడం లేదు.. ప్రభుత్వం మీద బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దారుణంగా విష ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నారు.
తాము సక్రమంగా ఉద్యోగాలు సాధించామని.. అనేక సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వ కొలువు ను దక్కించుకున్నామని కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారంతా కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు మీదికి ఎక్కి జగన్ చేస్తున్న విష ప్రచారానికి గట్టిగా బుద్ధి చెప్పారు. వాస్తవానికి డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. ఈ విషయంలో నారా లోకేష్ అనేక సందర్భాలలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. కానీ ఇంతవరకు ఆయన ఆ సవాల్ స్వీకరించలేకపోయారు. కానీ కొంతమంది వైసిపి ముసుగులో ఉన్న సో కాల్డ్ జర్నలిస్టులు కొత్తగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందామని చెప్పాలంటూ బెదిరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక పర్యాయాలు క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలు పొందిన వారు కూడా స్పష్టత ఇచ్చారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పాలు పంచుకున్న అధికారులు కూడా ఆధారాలతో సహా చెప్పారు. అయినప్పటికీ వైసీపీ తన విష ప్రచారాన్ని ఆపడం లేదు. తన వితండవాదాన్ని తగ్గించడం లేదు. ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారే సాక్షి మీడియాను ముట్టడిస్తారు. వైసీపీ నాయకులకు సిసలైన బుద్ధి చెబుతారని టిడిపి నేతలు అంటున్నారు.