Lalithaa Jewellery Kiran Kumar: ఐదో తరగతి డ్రాప్ అవుట్. చదువుకునే అవకాశం లేదు. అలాగని అతనికి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలో తెలియదు. ఇదే సమయంలో అతనికి కొంతకాలం గడిచిన తర్వాత వ్యాపారం చేయాలి అనిపించింది. ఇదే సమయంలో అతని తల్లి నాలుగు బంగారు గాజులు ఇచ్చింది. ఆ తర్వాత అతడి కథ మొత్తం మారిపోయింది.
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో బంగారం వ్యాపారం మొత్తం తమిళనాడు.. కేరళ వ్యాపారుల చేతిలోనే ఉంటుంది. ఇది పూర్తిగా లక్షల కోట్లలో ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేశాడు. ఎక్కడో నెల్లూరులో పుట్టిన ఇతడు.. ఐదో తరగతి డ్రాప్ అవుట్ అయ్యాడు. పెద్దగా చదువుకోలేదు. అమ్మ ఇచ్చిన నాలుగు బంగారు గాజులతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అంతకుముందు బంగారం వర్తకుల దగ్గర పనిచేసేవాడు. అనుభవాన్ని గడించాడు. ఈ రంగంలో ఉన్న ఆటుపోట్ల గురించి అంచనా వేశాడు. ఆ తర్వాత తన మీద తనకున్న నమ్మకంతో ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. తల్లి ఇచ్చిన నాలుగు బంగారు గాజులతో వ్యాపారం ప్రారంభించాడు.
మూడు దశాబ్దల తర్వాత ఆయన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ పేరుతో తమిళనాడు.. ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ.. రాష్ట్రాలలో ఎన్నో స్టోర్లను నిర్వహిస్తూ.. వేలకోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఒక అంచనా ప్రకారం 11 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అతను సృష్టించాడు. లలిత జ్యువెలర్స్ అనగానే చాలామందికి గుండుతో కనిపించే గుర్తుకొస్తాడు. అతడు తన వ్యాపారానికి సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోలేదు. తన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. చివరికి తన సంస్థలను తానే ప్రారంభించుకుంటాడు. పెద్దగా గెస్టులను పిలవడు. ఒకవేళ పిలిచినా వారితో షో రూమ్ ఓపెన్ చేయించడు. తన సంస్థలో ఆభరణాల తయారీ.. అత్యాధునిక యంత్రాలు.. ఇంకా రకరకాల వ్యవహారాలను చూపిస్తుంటాడు. బంగారం విక్రయించే ఏ వ్యాపారి కూడా ఇలా ఓపెన్ గా చూపించడు. అందువల్లే లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యాపత్ భారతదేశం లోనే ప్రత్యేకమైన బంగారు నగల వ్యాపారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తన దుకాణం గురించి ప్రమోట్ చేసుకునే క్రమంలో.. డబ్బులు ఎవరికీ ఊరికనే రావు.. మా షాపులో బంగారం కొనేముందు ఇతర షాపులలో పోల్చి చూసుకోండి.. మీకు తక్కువగా అనిపిస్తేనే తీసుకోండి. మా షాపులో కొనుగోలు చేయమని నేను ఎవరి మీదా ఒత్తిడి తీసుకురాను.. అంటూ డిఫరెంట్ గా తన షాప్ గురించి ప్రమోషన్ చేసుకుంటాడు కిరణ్ కుమార్. అందువల్లే ఈ స్థాయిలో అతడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.