Nara Lokesh: తమకు చేతకాని పని.. ఇంకొకరు చేస్తే ఓర్చుకోలేని గుణం వైసిపి నేతలది. అఫ్కోర్స్ ఆ పార్టీ పెద్దకూడా అలానే ఉంటారు. అందువల్లే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అనవసరమైన రంద్రాన్వేషణ చేస్తున్నారు.
ఉన్నత చదువులు చదివిన పేద విద్యార్థులకు టీచర్ కొలువులు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం చేసిన తప్పు అన్నట్టుగా వైసిపి నాయకుల ప్రచారం సాగుతోంది. దీనికి ఇప్పుడు మరికొన్ని తోక చానల్స్ తోడయ్యాయి. ఏదో జరిగిపోయింది అన్నట్టుగా.. అడ్డగోలుగా విష ప్రచారం చేసి కూటమి ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి విష ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మీడియాలో పిచ్చిపిచ్చి రాతలు రాయడం కాదు.. నేరుగా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు. దీనికి తోడు వైసిపి కోర్టుకు వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సాక్షి లో వస్తే నమ్మరు కాబట్టి మరో తోక ఛానల్ విష ప్రచారం చేయడం మొదలు పెట్టింది.
వైసిపి.. ఇంకా కొన్ని భజన చానల్స్ చేస్తున్న విష ప్రచారానికి నారా లోకేష్ అడ్డుకట్ట వేశారు. అంతేకాదు ఏపీలో లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు బంగారం లాంటి శుభవార్త చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే తాము డిఎస్సి నిర్వహించామని.. 2029 లోపు మనం మూడుసార్లు డిఎస్సీ ప్రకటనలు విడుదల చేస్తామని.. దీనికి సంబంధించి పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని.. నిరుద్యోగ యువతకు బ్రహ్మాండంగా అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం పెట్టగానే 16000 పోస్టులతో మెగా డీఎస్సీ ని నారా లోకేష్ ప్రకటించారు. ఆ నియామకలను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఇప్పుడు ఏపీలో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల నాటికి మిగతా ఖాళీలను మొత్తం భర్తీ చేస్తామని నారా లోకేష్ చెబుతున్నారు. కేవలం పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం కాదని.. ఉన్నత విద్యాలయాలలో అధ్యాపకులు.. సహాయక అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని.. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని నారా లోకేష్ గట్టి సంకల్పంతో ఉన్నారు. రకరకాల నిర్ణయాల వల్ల ఏపీలో విద్యావ్యవస్థ దెబ్బ తిన్నది. దానికి పూర్వరూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని లోకేష్ చెబుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది విద్యార్థులు ప్రైవేటు విద్యాలయాలను వదిలిపెట్టి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని.. లక్ష మంది విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల గుమ్మం తొక్కడం ఆనందంగా ఉందని లోకేష్ చెబుతున్నారు.
కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇస్తామని చెప్పకుండా.. జాబ్ క్యాలెండర్ లో భాగంగా ప్రతి ఏడాది డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని నారా లోకేష్ బలమైన నమ్మకం నిరుద్యోగులు కల్పిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదని లోకేష్ అంటున్నారు