Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: భోగాపురం విమానాశ్రయంలో లోకేష్.. అలా చూసేసరికి ప్రయాణికుల షాక్!

Nara Lokesh: భోగాపురం విమానాశ్రయంలో లోకేష్.. అలా చూసేసరికి ప్రయాణికుల షాక్!

Nara Lokesh: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానం కాకుండా డొమెస్టిక్ ఫ్లైట్లోనే మంత్రి నారా లోకేష్ రావడం విశేషం. విమాన రాకపోకలు ప్రారంభమైన తొలిసారిగా లోకేష్ చేరుకోవడంతో ఘనస్వాగతం లభించింది. మరోవైపు సాధారణ ప్రయాణికులతో కలిసి లోకేష్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు విమానాశ్రయ వర్గాలు […]

Nara Lokesh: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానం కాకుండా డొమెస్టిక్ ఫ్లైట్లోనే మంత్రి నారా లోకేష్ రావడం విశేషం. విమాన రాకపోకలు ప్రారంభమైన తొలిసారిగా లోకేష్ చేరుకోవడంతో ఘనస్వాగతం లభించింది. మరోవైపు సాధారణ ప్రయాణికులతో కలిసి లోకేష్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు విమానాశ్రయ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. విమానాశ్రయంలో నిర్మాణాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈనెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ నెల 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.

* సాధారణ ఫ్లైట్ లోనే..
రాత్రి 8:30 గంటలకు విజయవాడలో డొమెస్టిక్ ఫ్లైట్లో తోటి ప్రయాణికులతో కలిసి బయలుదేరారు మంత్రి నారా లోకేష్. రాత్రి 9:45 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో వివిధ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్ళనున్నారు నారా లోకేష్. విమానాశ్రయంలో నారా లోకేష్ సందర్శనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

* ప్రారంభోత్సవం అలా..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పట్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించి బాధ్యతలు తీసుకున్నారు మంత్రి నారా లోకేష్. ప్రధాని హాజరైన ప్రారంభోత్సవ సభలో సైతం కీలక ప్రసంగం చేశారు. అయితే పూర్తిస్థాయిలో విమాన రాకపోకలు ప్రారంభించిన తర్వాత లోకేష్ రావడం ఇదే మొదటిసారి. తోటి ప్రయాణికులతో ఆనందంగా గడిపారు లోకేష్. మరోవైపు భోగాపురం విమానాశ్రయంలో లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. అందర్నీ నమస్కరిస్తూ ముందుకు సాగారు నారా లోకేష్. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper