అమరావతిలో మరో కీలక నిర్మాణం జరగనుంది. అమరావతి ఐ పేరుతో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రీస్ వీల్ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అమరావతి గ్రూప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఫెర్రీస్ వీల్ ఎయిర్ దుబాయిను తలదన్నేలా… 250 మీటర్ల కంటే ఎత్తులో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి డిజైన్లతో అమరావతిలో అసెంబ్లీ, హై కోర్ట్, సచివాలయం, హెచ్ ఓ డి టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పుడు అతి ఎత్తైన ఫెర్రీస్ వీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచాన్ని ఆకర్షించనుంది.
* లండన్ నమూనా గా..
ఫెర్రీస్ వీల్ కు మంచి గుర్తింపు ఉంది. లండన్ నగరంలోని థేమ్స్ నది ఒడ్డున లండన్ ఐ అనే పర్యాటక ప్రాంతం ఉంది. దాని స్ఫూర్తితోనే ఇప్పుడు కృష్ణా నది తీరంలో అమరావతి ఐ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లండన్ ఐ ఎత్తు 120 మీటర్లు అయితే.. ఇప్పుడు కృష్ణా నది తీరంలో నిర్మించే అమరావతి ఐ 139 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఆ మేరకు అమరావతి గ్రూప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఊహించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో నిబంధనలను సవరిస్తూ మరోసారి టెండర్లు పిలిచారు. మొదటిసారి టెండర్ ప్రకటన జారీచేసిన సమయంలో అమరావతి ఐ ఏర్పాటు కోసం ఐదు ఎకరాల భూమి, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కోసం మరో ఎకరం మాత్రమే కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రయోజనం తో పాటు వాణిజ్య కార్యకలాపాల కోసం మరింత భూమి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో నిబంధనలను సవరిస్తూ తాజాగా టెండర్లకు పిలిచారు.
* దుబాయ్ కంటే ఎత్తైనది..
అయితే ప్రపంచంలోనే ఎత్తయిన ఫెర్రీస్ వీల్ దుబాయ్ లో ఉంది. 250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 1750 మంది ఇందులో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అందుకే దాని నమూనాగా.. అంతకుమించి అన్నట్టు.. ఈద్ దుబాయ్ కంటే అంటే 250 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన సర్వీస్ వీల్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే మూడు కేటగిరీల్లో టెండర్లు ఆహ్వానిస్తున్నారు. 250 మీటర్ల కంటే ఎత్తు, 128 నుంచి 175 మీటర్ల ఎత్తు, 175 నుంచి 200 మీటర్ల ఎత్తయిన ఫెర్రీస్ వీల్స్ ఇలా మూడు విభాగాలుగా విభజించారు. అందుకు అనుగుణంగా టెండర్లు పిలవనున్నారు.