Amaravati Capital: అటు చూస్తే కొండవీటి వాగు.. ఇటు చూస్తే పచ్చటి పంట పొలాలు.. మధ్యలో ఆకాశాన్ని తాకే భవంతులు.. సీడ్ యాక్సెస్ రోడ్డు.. ప్రవేటు హోటల్లు.. విఖ్యాత విద్యాసంస్థలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..
ఉపోద్ఘాతం చెబుతుంటే ఇదంతా కూడా న్యూయార్క్ లోనో.. సింగపూర్ లోనో.. పక్కనే ఉన్న హైదరాబాదులోనో కాదు.. మన ఆంధ్రుల రాజధాని అమరావతిలో.. కలల సౌధంగా.. వైకుంఠపురికి నకలుగా ఈ చారిత్రాత్మక రాజధాని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2019 నుంచి 24 వరకు అమరావతి అంధకారంలో మునిగిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తేజోమయంగా వెలిగిపోతోంది. 25 వేల మంది కార్మికులు 24 గంటల పాటు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఫలితంగా అమరావతి నగరి దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
అమరావతి రాజధాని లో ప్రజా ప్రతినిధులకు సంబంధించి నూతన నివాసాల నిర్మాణం పూర్తయింది. అత్యధిక హక్కులతో క్వార్టర్లు సిద్ధమయ్యాయి. ఇందులో అద్భుతమైన సదుపాయాలు కల్పించారు. డెమో హౌస్ లో ముఖ్యమంత్రి ఇప్పటికే ఏర్పాటును పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు.. మంత్రుల నివాసాల కోసం భారీ టవర్లను నిర్మించారు. ప్రజా ప్రతినిధులు వీఐపీలతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఆఫీసు రూమ్లను సిద్ధం చేశారు. ఇందులో అత్యాధునికమైన వాష్రూమ్లను నిర్మించారు. అతిధుల కోసం ఏసీ సదుపాయంతో 478 చదరపు అడుగుల్లో ప్రత్యేకమైన లివింగ్ రూమ్.. సోఫా సెట్లు అందుబాటులో ఉంచారు. 60 * 60 స్క్వేర్ ఫీట్ లో దేవుడి పూజ గది.. 216 స్క్వేర్ ఫీట్లలో మోడ్రన్ రాక్స్.. స్టవ్ లను ఏర్పాటు చేసి.. విశాలమైన కిచెన్ నిర్మించారు.
ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభమైంది. కొండవీటి వాగు ప్రవాహాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ రోడ్డు నిర్మించారు. ఇక ప్రఖ్యాత సి ఆర్ డి ఏ కార్యాలయ నిర్మాణం చివరి దశకు వచ్చింది. మిగతా కార్యాలయాల నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతోంది.. మొత్తంగా చూస్తే అమరావతి అతి స్వల్ప కాలంలోనే ఆంధ్రుల చిరకాల వాంఛను నెరవేర్చడానికి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా మీ రాజధాని ఏది అని చాలామంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను చులకనగా చూసేవారు. ఇకపై మా రాజధాని ఇది అని ఆంధ్రులు గర్వంగా చెప్పుకోవడానికి అమరావతి సిద్ధమవుతోంది. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి దేశానికి కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేందుకు అందంగా రూపుదిద్దుకుంటున్నది.
అమరావతి: ప్రజాప్రతినిధుల (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు) నూతన నివాసాల నిర్మాణం పూర్తి.. హంగులతో సిద్ధమైన క్వార్టర్లు..
అత్యాధునిక సదుపాయాలు, డెమో హౌస్‌లోని ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి..
ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల కోసం ఆల్మోస్ట్ 9 భారీ టవర్ల నిర్మాణం..… pic.twitter.com/tXT4lUAkp8
— RTV (@RTVnewsnetwork) August 14, 2026