AP Disaster Management: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ అమ్ములపొదిలో అత్యాధునిక వాహనాలు వచ్చి చేరాయి. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ వాహనాలను ప్రారంభించారు ఈరోజు. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇదో సరికొత్త అధ్యయనం అని చెప్పవచ్చు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్గదర్శకంలో అగ్నిమాపక శాఖకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ సరికొత్త అత్యాధునిక వాహనాలను సమకూర్చింది. భారీ విపత్తులతోపాటు అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడనున్నాయి. దాదాపు 50 వాహనాలకు పైగా ఒకేసారి ప్రారంభం కావడం.. అమరావతి రోడ్డులో దూసుకుపోవడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్ననే అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు.. 24 గంటలు తిరగక ముందే ఈ సరికొత్త వాహనాలను ప్రారంభించారు.
* అన్నీ ప్రత్యేకమే..
మొత్తం 58 ఫైర్ ఫైటింగ్ వాహనాలు అగ్నిమాపక శాఖకు అందుబాటులోకి రావడం విశేషం. అందులో 25 అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు.. 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గ్రామీణ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో అత్యాధునికంగా సేవలు అందిస్తాయి ఈ 25 ఫైర్ ఫైటింగ్ వాహనాలు. భారీ అగ్ని ప్రమాదాల సమయంలో నిరంతరాయంగా నీటి సరఫరా చేసేందుకు 20 వాటర్ బౌజర్లు అందుబాటులోకి వచ్చాయి. రద్దీ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో చాలా సులువుగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు కూడా అగ్నిమాపక శాఖకు సమకూర్చుతూ సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం.
* స్పెషల్ ఫోకస్..
అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త అగ్నిమాపక శాఖ కార్యాలయాలతో పాటు వాహనాలను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతగా 35 కోట్ల రూపాయలతో ఇప్పటికే వాహనాలను మంజూరు చేసింది. ఇప్పుడు అగ్నిమాపక శాఖ అమ్ములపొదిలో ఈ అత్యాధునిక వాహనాలు సమకూరడం మాత్రం గొప్ప విషయం. అయితే అమరావతిలో వీటిని జండా ఊపి ప్రారంభించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram