Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో చాలా ఇంటెన్స్ గా సాగుతోంది. జడ్జీలు కంటెస్టెంట్స్ తో ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, కంటెస్టెంట్స్ మాత్రం ప్రతీ ఒక్కరు తమ వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీజన్ లో ఒక్కో కంటెస్టెంట్ ఎలా ఉన్నారంటే , ఇతను బిగ్ బాస్ షో కి పనికి రాడు అని చెప్పడానికి కారణాలు లేవు , అలా ఉన్నారు ఒక్కొక్కరు. నేటి ఎపిసోడ్ లో చాలా మంది కంటెస్టెంట్స్ తమలోని సత్తా చాటారు. వీరిలో ఇంత టాలెంట్ ఉందా? , ఆశ్చర్యం గా ఉంది అని అనిపించినా కంటెస్టెంట్స్ హేమంత్ , దీపక్. వీళ్లిద్దరు నేటి ఎపిసోడ్ లో ఇచ్చిపారేశారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఆడిషన్స్ సమయం లోనే జడ్జీలను ఆకర్షించి మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ని సొంతం చేసుకొని టాప్ 15 లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్, మితిలేష్ రెడ్డి వంటి వారు , సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదనే భావన అందరిలోనూ నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ నేటి ఎపిసోడ్ లో మాత్రం వీళ్లిద్దరు బాగా షైన్ అయ్యారు. ముఖ్యంగా చరణ్ అయితే , చాలా బాగా టాస్కులు ఆడాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా , తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చాడు. ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దాదాపుగా మార్గం సుగమం చేసుకున్నట్టే. ఇక రోహిత్ సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయనకు ఈరోజు టాస్కులు పెర్ఫార్మ్ చేసే స్కోప్ రాలేదు కానీ , తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. సరైన సమయం వచ్చినప్పుడు పాయింట్స్ పెడుతున్నాడు. అదే విధంగా తనలోని ఫైర్ ని కూడా బయటకు తీసాడు.
కష్టపడి స్ట్రాటజీలు వేసి తన టీం ని గెలిపించిన వ్యక్తిని , రామకృష్ణ నువ్వు లీడర్ గా పనికిరావు అని తీసేసినప్పుడు, రోహిత్ పెట్టిన పాయింట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. అదే విధంగా రామకృష్ణ గట్టిగా తనపై అరుస్తూ మాట్లాడినప్పుడు, ‘అరవకు.. నాతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త’ అని రోహిత్ ఫైర్ తో చెప్పిన విధానం కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో టాస్కులు ఆడుతున్నప్పుడు భాగీ భుజానికి గాయం అవ్వడం , ఆమెని మెడికల్ రూమ్ కి తరలించడం , కాసేపటి తర్వాత ఆమె చేతి కట్టుతో స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వడం వంటివి జరిగాయి. అయితే ఈమె ఈ కారణం తోనే ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యిందట. ఇప్పటి వరకు ఈ షో నుండి గాయత్రీ , భాగీ ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన టాప్ 13 లో , అత్యధిక ఓట్లతో ప్రస్తుతం నెంబర్ 1 లో కొనసాగుతున్న కంటెస్టెంట్ రోహిత్ అట.