Womens Health Problems : మహిళల్లో గర్భాశయంనకు సంబంధించి అనేక సమస్యలు వస్తుంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన సమస్య ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘ఎండోమెట్రియల్ క్యాన్సర్’. ఇది గర్భశయంలోపల ఉండే సమస్యల వల్ల ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటీ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
చాలా మంది మహిళలల్లో పీరియడ్స్ సమయంలో సాధారణం కంటే ఎక్కువగా రక్తస్రావం కావడం దీని లక్షణాల్లో ఒకటిగా అనుకోవచ్చు. మోనోపాజ్ తర్వాత మళ్లీ రక్త స్త్రావం కనిపిస్తే ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. అయితే కేవలం రక్తస్రావం ఉంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనుకోకుండా హార్మోన్ల ప్రభావం కూడా ఉండొచ్చని అంటున్నారు. కానీ ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని గుర్తించడానికి పొత్తి కడుపులో నొప్పి కూడా ఉండొచ్చు. అలాగే పెల్విక్ ప్రాంతంలో కూడా పెయిన్ ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఇది లైంగిక సమయంలో ఉండే అవకాశం ఉంది. కానీ అనారోగ్య లక్షణాల్లో కూడా ఇది కావొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు.
ఈ రకమైన క్యాన్సర్ ఏదో ఒక్క లక్షణమే కారణం అని చెప్పలేమంటున్నారు. ఒకేసారి బరువు తగ్గడం, ఆలస్యంగా మోనోపాజ్ రావడం వంటివి కూడా ఉంటాయని చెబుతున్నారు. కొందరి మహిళల్లో జన్యుపరమైన లోపాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు ఉన్న వారిలో ఈ స్ట్రోజెన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల బరువు విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల కొంత ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.
అయినా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అయితే దీనిపై ముందస్తు పరీక్షలు కాకుండా వైద్యుల సలహా మేరకు తప్పనిసరిగా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.