Amaravati: మన గురించి ఇక్కడ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం తెలియాల.. అప్పుడే మనమంటే ఏందో ప్రపంచం గుర్తిస్తుంది.. అప్పట్లో పేరుపొందిన ఓ సినిమాలో వినిపించిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ లాగే సాగుతోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనితీరు. ఆయన ముందుచూపు.. వేస్తున్న అడుగులు.. పరుగులు తీస్తున్న ప్రగతి.. ఇవన్నీ ఏపీ రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద సరికొత్తగా చూపిస్తున్నాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఖరారైంది. అప్పట్లోనే అమరావతికి సంబంధించి భూముల సేకరణ జరిగింది. సిఆర్డిఏ ఏర్పాటయింది. 2014 నుంచి 2019 వరకు రాజధాని నిర్మాణంలో ఒక్కో దశకు అంకురార్పణ జరిగింది. 2019 తర్వాత అమరావతికి చీకటి దశ మొదలైంది. జగన్ ప్రభుత్వం లో అమరావతి పడావు పడింది. ఆకాశాన్ని తాకే నిర్మాణాలతో సందడిగా ఉండాల్సిన ఆ ప్రాంతం చీకటి దిబ్బగా మారిపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అమరావతిలో తట్టెడు మట్టి ఎత్తలేదు. కనీసం ఒక నిర్మాణం కూడా చేపట్టలేదు. ఒక ఇటుకను కూడా తీర్చలేదు. ఇలా ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది.
2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా అమరావతి గ్లోబల్ వ్యాప్తంగా తన తన బ్రాండ్ ను సుస్థిరం చేసుకుంది. అమెరికా కేంద్రంగా వార్తలను ప్రచురించే ప్రఖ్యాత ది న్యూయార్క్ టైమ్స్ అమరావతికి ప్రాధాన్యం ఇచ్చింది. అంతేకాదు అమరావతి రాజధాని మీద ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమరావతిలో ప్రతిరోజు 25 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని.. ఈ రాజధాని ప్రాంతం 60 శాతం పచ్చదనాన్ని కలిగి ఉందని.. క్వాంటం వ్యాలీ.. అద్భుతంగా రూపొందుతోందని.. ఎకో ఫ్రెండ్లీగా.. గ్లోబల్ సిటీగా అవతరిస్తుందని.. సరికొత్త జీవన ప్రమాణాలకు నాంది పలుకుతోందని.. వచ్చే రోజుల్లో అమరావతి కొత్త బెంచ్ మార్క్ సృష్టించబోతుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
అమరావతి నిర్మాణం సాగుతున్న తీరును ది న్యూయార్క్ టైమ్స్ బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న పనులను న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు పరిశీలించారు. దీనిని ఆధునిక భారతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇండియాలోని అతిపెద్ద క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారు.
పర్యావరణ పరిరక్షణకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడి నగర విస్తీర్ణం లో 60% భాగం నీటి వనరులకు.. పచ్చదనానికి పెద్ద బిడ్డ వేస్తున్నారు. కాలుష్యం లేని గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ను ప్రోత్సహిస్తున్నారు. 2000 మైళ్ళ పొడవులో సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నారు.
రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి దాదాపు 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సేకరించారని.. ఇది ప్రపంచంలోనే సరికొత్త ఘనత అని న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు గుర్తు చేశారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని నిర్మాణం మందగించిపోయిందని.. ఇప్పుడు స్పీడ్.. స్పీడ్.. స్పీడ్ అనే విధానంలో అమరావతి నిర్మాణం ఊహకందని వేగంగా సాగిపోతుందని పేర్కొన్నారు. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం పట్ల చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కాదు నాని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. అమరావతి అనేది ఒక నగరం మాత్రమే కాదని.. భారత దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలకు కొలబద్ద అని.. అలా తీర్చిదిద్దడమే తన ఆశయమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Our ambition for Amaravati is not merely to build a great capital, but to set a new benchmark for livability in India. A city that is green, efficient, inclusive and designed around the quality of everyday life. A city that proves world-class urban living is not a distant ideal -… pic.twitter.com/ASmTqlhPKI
— N Chandrababu Naidu (@ncbn) August 13, 2026