Akhil Akkineni: 100 కోట్లతో అఖిల్ నెక్స్ట్ సినిమా.. అవసరమా అంటున్న నెటిజన్లు..!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా కూడా అది పూజా హెగ్డే ఖాతాలో పడిపోయింది. అలా ఇప్పటివరకు సరైన హిట్ లేని అక్కినేని అఖిల్ త్వరలోనే రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

  • Written By: Suresh
  • Published On:
Akhil Akkineni: 100 కోట్లతో అఖిల్ నెక్స్ట్ సినిమా.. అవసరమా అంటున్న నెటిజన్లు..!!

Follow us on

Akhil Akkineni: నాగార్జున నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అఖిల్. ఈయన నటించిన కొన్ని సినిమాలు సూపర్ హట్ ను సంపాదిస్తే.. చాలా సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. వరుసగా ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో నాగార్జున కూడా కాస్త డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఏజెంట్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో సినిమా ఇండస్ట్రీలో ఈయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం మరో పెద్ద సాహసమే చేస్తున్నారు అఖిల్.. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా కూడా అది పూజా హెగ్డే ఖాతాలో పడిపోయింది. అలా ఇప్పటివరకు సరైన హిట్ లేని అక్కినేని అఖిల్ త్వరలోనే రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే రూ. 80 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం రూ. 10 కోట్లు కూడా ఏజెంట్ మూవీ రాబట్టలేకపోయింది. కానీ ఏ నమ్మకంతో అఖిల్ నెక్స్ట సినిమాకు రూ. 100 కోట్లు పెడుతున్నారని చాలా మంది నెటిజన్లు ఇది అవసరమా అంటున్నారు. అంతే కాదు అఖిల్ హీరోగా చేయబోయే రూ. 100 కోట్ల సినిమాకు అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. కొత్త డైరెక్టర్ ను నమ్మి రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టడమా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ ను పెట్టడానికి యూవీ క్రియేషన్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కథలో కంటెంట్ ఉండడం వల్ల యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ ఉన్నారని తెలుస్తోంది. కానీ అఖిల్ ను నమ్మి ఈ రేంజ్ బడ్జెట్ ను పెట్టడం ఏంటని.. అఖిల్ సినిమాకు ఇంత బడ్జెటా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 7 అలాగే నా సామి రంగ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. నాగచైతన్య కూడా మంచి యాక్షన్ మూవీలతో హిట్ ను సంపాదిస్తున్నారు. కానీ అఖిల్ మాత్రమే పుంజుకోవడానికి సమయం పడుతున్నట్టుగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు