Hollywood AI Fears: రోడ్డునపడ్డ హాలీవుడ్.. కృత్రిమ మేధ(AI) ప్రకంపనలు… నటుల సమ్మె, నిలిచిపోయిన షూటింగ్స్!

అన్ని రంగాల్లో మనుషులకు AI ప్రత్యామ్నాయం కానుంది. క్రియేటివ్ ఫీల్డ్స్ ని కూడా ఈ కృత్రిమ మేధ ముంచెత్తుతుంది. ఆల్రెడీ AI న్యూస్ రీడర్స్ వచ్చేశారు. చిత్ర పరిశ్రమలో AI సమూల మార్పులకు కారణం అవుతుంది. అసలు నటుల అవసరం లేకుండా పోయే రోజు త్వరలోనే ఉంది. కృత్రిమ మేధ వినియోగాన్ని నియంత్రించకపోతే అసలుకే మోసం వస్తుందని హాలీవుడ్ నటులు భావిస్తున్నారు.

  • Written By: Shiva
  • Published On:
Hollywood AI Fears: రోడ్డునపడ్డ హాలీవుడ్.. కృత్రిమ మేధ(AI) ప్రకంపనలు… నటుల సమ్మె, నిలిచిపోయిన షూటింగ్స్!

Follow us on

Hollywood AI Fears: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవాళిని భయపెడుతుంది. అంతకంతకు మానవ వనరుల వినియోగం తగ్గిపోతుండగా ఆందోళనలు మొదలవుతున్నాయి. అన్ని రంగాలకు కృత్రిమ మేధ వ్యాపిస్తుంది. మనుషుల అవసరాన్ని తగ్గించేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసే కృత్రిమ మేధ వైపు కార్పొరేట్ కంపెనీలు చూస్తున్నాయి. ఇప్పటికే కృత్రిమ మేధ కారణంగా లక్షల్లో ఉద్యోగాలు ఆవిరయ్యాయి. ప్రాథమిక దశలోనే ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే రానున్న కాలంలో మనుషుల అవసరం అనేది లేకుండా పోయే ప్రమాదం ఉంది.

అన్ని రంగాల్లో మనుషులకు AI ప్రత్యామ్నాయం కానుంది. క్రియేటివ్ ఫీల్డ్స్ ని కూడా ఈ కృత్రిమ మేధ ముంచెత్తుతుంది. ఆల్రెడీ AI న్యూస్ రీడర్స్ వచ్చేశారు. చిత్ర పరిశ్రమలో AI సమూల మార్పులకు కారణం అవుతుంది. అసలు నటుల అవసరం లేకుండా పోయే రోజు త్వరలోనే ఉంది. కృత్రిమ మేధ వినియోగాన్ని నియంత్రించకపోతే అసలుకే మోసం వస్తుందని హాలీవుడ్ నటులు భావిస్తున్నారు.

వారు నిరసనకు దిగారు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ బంద్ చేపట్టింది. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు నటించేది లేదంటున్నారు. షూటింగ్స్ లో పాల్గొనమని తమ గళం వినిపిస్తున్నారు. నటుల పారితోషికాలు పెంచాలి, AI వినియోగంపై నియంత్రణలు విధించాలని వారు కోరుతున్నారు. హాలీవుడ్ లో ఈ పరిమాణం ప్రాధాన్యత సంతరించుకుంది. 1980 తర్వాత నలబై ఏళ్లకు హాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది.

అయితే నటుల డిమాండ్స్ ని బడా నిర్మాణ సంస్థలు నెరవేర్చేందుకు సుముఖంగా లేవు. నటులు పారితోషికాలు పెంచడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి భద్రత కల్పించేందుకు నిరాకరిస్తున్నారు. కృత్రిమ మేధతో మానవాళికి ముప్పు ఉందని గతంలో చాలా మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. AI సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ మొదలైపోగా కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

https://twitter.com/DDNewsAndhra/status/1679699100239818753

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు